Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మలబద్ధకం సమస్యకు ఉత్తమ మందు ‘కర్బూజ'

బుధవారం, 17 మే 2017 (10:58 IST)

Widgets Magazine
kharbuja

వేసవికాలంలో లంభించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటిని ఆరగించడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు చలువ కూడా చేస్తుంది. ఇక తర్బూజా పండుతో పొందే ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే.
 
మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందాలంటే కర్బూజా ఎంతో ముఖ్యమైన మందు. పొటాషియం రక్తపోటును క్రమపరిచి హైపర్‌టెన్షన్‌ని దూరంగా ఉంచుతుంది. కర్బూజాలో ఉండే విటమిన్‌ ఏ, బీటా కెరొటిన్‌ దృష్టిని మెరుగుపరిచి శుక్లాలు రాకుండా కాపాడుతుంది. 
 
కర్బూజాలోని చక్కెరను శరీరం తేలికగా జీర్ణం చేసుకోగలదు. కర్బూజా విత్తనాల్లో ఉండే ప్రత్యేకమైన పీచు వల్ల బరువు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. వీటిలో ఉండే పొటాషియం పొట్ట దగ్గరి కొవ్వును కరిగిస్తుంది.
 
ఈ పండు తినటం వల్ల రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి. ఇందులోని విటమిన్‌ 'సి' రోగ నిరోధకశక్తిని పెంచుతుంది. తెల్ల రక్తకణాల సంఖ్య పెంచి వ్యాధికారక బ్యాక్టీరియా, వైరస్‌ల నుంచి రక్షణ కల్పిస్తుంది. కర్బూజా తింటే కండరాలు, నరాలు రిలాక్స్‌ అయి మంచి నిద్ర పడుతుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నానబెట్టిన నువ్వులను పాలతో కలిపి తీసుకుంటే...?

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చూసేందుకు చిన్నవిగా వున్నా వాటి శక్తి ...

news

స్త్రీలకు వార్నింగ్... పురుషులు వాడాల్సినవి పక్కన పడేసి స్త్రీకి గర్భ నిరోధక మాత్రలా?

ఇప్పుడే పిల్లలు వద్దు అని చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అనుకుంటారు. కొంతకాలం సంతోషంగా ...

news

అల్లం చేసే మేలెంతో తెలుసా?

త్రిదోషాలైన వాత, పైత్య, శ్మేష్మాలను హరించే శక్తి అల్లానికి ఉంది అల్లం నోటికి మంచి రుచిని ...

news

కీళ్ళ నొప్పులను దూరం చేసే ఆవనూనె.. ఎలాగంటే?

ఆవనూనెలో గానీ, నువ్వుల నూనెలో గానీ, నాలుగు వెల్లుల్లిపాయలు వేసి వేడిచేసి నొప్పులున్న ...

Widgets Magazine