గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 23 మే 2016 (22:02 IST)

మధుమేహానికే కాదు.... కాకర చేదులో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు...

కాకరలో తేమశాతం 92.4 దాకా వుంటుంది. ప్రోటీన్లు 1.6 శాతం, ఖనిజాలు 0.8 శాతం ఉంటాయి. ఇంకా కాకరలో కొవ్వు 0.2 శాతం, పీచు పదార్థం 0.8 శాతం, పిండి పదార్థాలు 4.2 శాతం, కాల్షియం 50 మిల్లీ గ్రాములు, సి విటమిన్ 96 మిల్లీ గ్రాములు, ఐరన్ 9.4 మిల్లీ గ్రాములు, ఫాస్ప

కాకరలో తేమశాతం 92.4 దాకా వుంటుంది. ప్రోటీన్లు 1.6 శాతం, ఖనిజాలు 0.8 శాతం ఉంటాయి. ఇంకా కాకరలో కొవ్వు 0.2 శాతం, పీచు పదార్థం 0.8 శాతం, పిండి పదార్థాలు 4.2 శాతం, కాల్షియం 50 మిల్లీ గ్రాములు, సి విటమిన్ 96 మిల్లీ గ్రాములు, ఐరన్ 9.4 మిల్లీ గ్రాములు, ఫాస్పరస్ 140 మిల్లీ గ్రాములు చొప్పున లభిస్తాయని వైద్యులు చెబుతున్నారు. 
 
కాకరను వారానికి రెండుసార్లైనా ఆహారంలో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా అతిసారం, మధుమేహం, నులిపురుగులు, గజ్జి, తామర వంటి చర్మవ్యాధులకు కాకర కాయలు ఔషధంగా ఉపయోగపడతాయి. కాకర యాంటి బయోటిక్‌గా పనిచేస్తుందని వైద్యులంటున్నారు.