శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By CVR
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (13:26 IST)

బీపీని కంట్రోల్ చేసే కాకరకాయ రసం

కావలసిన పదార్థాలు: 
కాకరకాయ - సగం
నిమ్మకాయ - సగం
ఉప్పు - చిటికెడు
పసుపు పొడి - పావు టీ స్పూన్
 
ఇలా తయారుచేయాలిః
కాకరకాయను శుభ్రంగా కడిగి, చిన్నచిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. తర్వాత ఆ ముక్కలపై కొంచెం నీళ్లు చల్లి, ఉప్పు, పసుపు పొడి కలిపి 15 నిమిషాల పాటు ఊరబెట్టుకోవాలి. ఆ తర్వాత కాకరకాయ ముక్కలను చేతితో గట్టిగా పిండి, ఆ తర్వాత వాటికి అవసరమైనంత మేర నీటిని చేర్చి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. 
 
చివరిగా ఆ మిశ్రమాన్ని వడపోసి, అందులో నిమ్మకాయను పిండి ఆ రసాన్ని సేవించాలి. దీనిని ప్రతిరోజు ఉదయం పరగడుపునే సేవించినట్లైతే బీపీ, షుగర్ వ్యాధులను నియంత్రిస్తుందని వైద్యులు పేర్కొంటున్నారు.