బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 27 జనవరి 2015 (14:14 IST)

బ్లాక్ బెర్రీ జ్యూస్‌తో మధుమేహానికి చెక్!

బ్లాక్ బెర్రీ జ్యూస్‌తో మధుమేహానికి చెక్ పెట్టవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్లాక్ బెర్రీ‌ జ్యూస్‌లోని విటమిన్ సి, ఇ మరియు పవర్ ఫుల్ యాంటీయాక్సిడెంట్‌ ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. అంతే కాదు మధుమేహాన్ని తగ్గిస్తుంది. ఇంకా, రక్తాన్ని శుద్ది చేసి, గొంతు నొప్పిని నివారిస్తుంది.
 
అలాగే ద్రాక్షరసంలో విటమిన్స్, మినిరల్స్, క్యాల్షియం, కాపర్, ఐయోడిన్ ఫాస్ఫరస్, పొటాషియం వంటివి ఫుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యానికి, గౌట్, కీళ్ళనొప్పులకు, లివర్ సమస్యలకు, హెమరాయిడ్స్, ఇతర అలెర్జీలను పోగొట్టేందుకు సహాయపడే మరికొన్ని అదనపు ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్నాయి.
 
ఇకపోతే.. కివి ఫ్రూట్ జ్యూస్ తీసుకుంటే కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు. ఇందులోని విటమిన్ సి, ఐరన్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈ జ్యూస్‌లో అధిక శాతం ఫైబర్, జీర్ణ శక్తిని పెంచే గుణాలు అధికమని న్యూట్రీషన్లు అంటున్నారు.