శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: గురువారం, 28 జనవరి 2016 (20:26 IST)

రక్తపోటు(బీపీ) చెక్ చేయించుకునేందుకు వెళ్లినప్పుడు...

మనిషి ప్రతినిత్యం ఏదో ఒక జబ్బుతో సతమతమవుతుంటాడు. చాలామంది నెలకు రెండు మూడు సార్లైనా బీపీ చెక్ చేసుకుంటుంటారు. బీపీ పరీక్షించుకోబోయే ముందు కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు వైద్యులు. 
 
* బీపీ పరీక్ష చేయించుకునేటప్పుడు మీరు కూర్చునే విధానం ప్రధాన పాత్ర పోషిస్తుంది. మీ వెనకాల సపోర్టు తప్పనిసరిగా ఉండాలి. కుర్చీలో వెనక్కి ఆనుకుని కూర్చోవాలి. పాదాలను రెండింటిని నేలపై ఆనించి ఉంచాలి. బీపీ చూసే చేతిని టేబుల్‌పై విశ్రాంతిగా ఉంచాలి. మోచేతి‌పై భాగం ఛాతి మధ్య భాగానికి వచ్చేలా చేతినివుంచాలి. 
 
* పరీక్ష చేయించుకోవడానికి వెళ్ళేముందు కనీసం అరగంటకు ముందు‌గానే కాఫీలు , టీలు, సిగరెట్లు తీసుకోకూడదు. ఇవన్నీ తాత్కాలికంగా బీపీని పెంచుతాయి. 
 
* పరీక్ష చేయించుకునేటప్పుడు ఎవరూ మాట్లాడకూడదు. మాట్లాడినా, విన్నా మనకు తెలియకుండానే స్వల్ప వత్తిడి పెరుగుతుంది. దీని వలన ఖచ్ఛితమైన బీపీ విలువ తెలుసుకోవడం సాధ్యం కాదంటున్నారు వైద్యనిపుణులు. 
 
* శారీరకంగాగాని, మానసికంగాగాని ఎలాంటి ఆందోళన, ఒత్తిడి ఉన్నా కూడా ఆ సమయంలో బీపీ పెరుగుతుంది. కాబట్టి మనసులో ఎలాంటి ఆలోచనలూ ఆందోళనలూ పెట్టుకోకూడదు. ఆ సమయంలో మూత్రవిసర్జనను ఆపుకోవడంలాంటి చిన్నచిన్న వత్తిళ్లకు కూడా దూరంగా వుండాలి.
 
* రెండు చేతులకూ పరీక్ష చేయించడం ఉత్తమం. రెండింటికీ నడుమ కనీసం 20 పాయింట్లు తేడా రావచ్చు. రెండింటిలో ఏది ఎక్కువగా ఉంటే దాన్ని దాన్ని పరిగణనలోకి తీసుకుంటామని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు.