శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 19 ఆగస్టు 2016 (12:23 IST)

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెస్ట్.. కోలన్‌ కేన్సర్‌‌కు చెక్ పెట్టాలంటే..?

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెస్ట్. సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. స్థూలకాయంతో బాధపడే వారు.. బరువు తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌ

వైట్ రైస్ కంటే బ్రౌన్ రైస్ బెస్ట్. సాధారణ బియ్యంతో పోల్చితే బ్రౌన్ రైస్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. స్థూలకాయంతో బాధపడే వారు.. బరువు తగ్గించుకోవడం కోసం ప్రయత్నిస్తున్న వారు బ్రౌన్ రైస్ తీసుకుంటే మంచిది. వారంలో ఐదు లేక అంతకన్నా ఎక్కువసార్లు వైట్‌రైస్‌ తీసుకునే వాళ్లలో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువని పరిశోధనల్లో తేలింది.
 
బ్రౌన్‌రైస్‌లో సెలీనియం అనే మినరల్‌ ఉంటుంది. ఇది కోలన్‌ కేన్సర్‌ రిస్క్‌‌ను తగ్గిస్తుంది. అంతేకాకుండా ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల కేన్సర్‌ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. డయాబెటిస్‌తో బాధపడే వారు బ్రౌన్‌రైస్‌ తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. వైట్‌రైస్‌ తీసుకునే వారితో పోల్చితే బ్రౌన్‌ రైస్‌ తీసుకునే వారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశం 16 శాతం తగ్గుతుంది. అధిక రక్తపోటును తగ్గించడంలో బ్రౌన్‌రైస్‌ కీలకపాత్ర పోషిస్తుంది.