మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : మంగళవారం, 16 డిశెంబరు 2014 (16:55 IST)

బరువు తగ్గాలంటే ఫైబర్ గల రాగులు తీసుకోండి

బరువు తగ్గించాలంటే ఫైబర్ గల రాగులు తీసుకోండి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఫైబర్ పుష్కలంగా ఉండే ఆహారాలు జొన్నలు, సజ్జలు, రాగులను ఆహారంలో తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చు అంటున్నారు న్యూట్రీషన్లు. ఇవి కొలెస్ట్రాల్ ను గ్రహించి పైత్యరసాన్ని పెంచుతుంది. దాంతో కొవ్వు బర్న్ చేసి త్వరగా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.
 
అలాగే అత్యుత్తమ ఔషధగుణగణాలు కలిగిన చౌకైన ఇండియన్ ఫుడ్ పసుపు. ఇది కొవ్వును కరిగించడం మాత్రమే కాదు, బరువు తగ్గిస్తుంది. చిటికెడు పసుపును గోరువెచ్చని పాలలో వేసి త్రాగడం వల్ల ఆరోగ్యానికి పలురకాలుగా మేలు చేస్తుంది. 
 
ఇకపోతే.. పెసరపప్పులో చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంది. పెసరపప్పును రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల ఇది విటమిన్ ఎ, ఇ మరియు సి శరీరానికి అందిస్తుంది. ఈ మూడు విటమిన్స్ కూడా బరువు తగ్గించడంలో కీలకపాత్రను పోషిస్తాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.