మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Updated : శుక్రవారం, 24 ఫిబ్రవరి 2017 (14:48 IST)

జీడిపప్పు తింటే కొవ్వు పెరుగుతుందా..? లావైపోయి గుండె జబ్బులొస్తాయా?

జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని కొందరు అపోహ పడుతుంటారు. ఐతే ఇది అపోహ మాత్రమే అంటారు ఆరోగ్య నిపుణులు. కాజు అని పిలిచే ఈ జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా వుంటుంది. జీడిపప్పులో ఎ,బి,సి,డి,ఇ, కె వి

జీడిపప్పు తినడం వల్ల బరువు పెరుగుతారని కొందరు అపోహ పడుతుంటారు. ఐతే ఇది అపోహ మాత్రమే అంటారు ఆరోగ్య నిపుణులు. కాజు అని పిలిచే ఈ జీడిపప్పులో కొవ్వు శాతం తక్కువగా వుంటుంది. జీడిపప్పులో ఎ,బి,సి,డి,ఇ, కె విటమిన్లు వుంటాయి. అంతేకాదు వీటిలో ఖనిజ లవణాలు, కాల్షియం, ఫాస్పరస్, ఐరన్ తదితర శక్తినిచ్చే ఖనిజ లవణాలు సమృద్ధిగా వుంటాయి. 
 
జీడిపప్పుతో రక్తాభివృద్ధి కలుగుతుంది. ఎనిమియా వ్యాధిని అరికడుతుంది. నరాల బలహీనత కూడా తగ్గుతుంది. జీడిపప్పులో ప్రోటీనులు 21 శాతం, తేమ 6 శాతం, కార్బొహైడ్రేట్ 2 శాతం, పీచు 1-3 శాతం, కాల్షియం 0.5 శాతం వుంటాయి. వీటితోపాటు శరీర బరువును పెంచకుండా వుంచగల శక్తినిచ్చే ఫాట్ 41 శాతం వుంటుంది. ఈ ఫ్యాట్ వల్ల ఆరోగ్యకరంగా ఎలాంటి హానీ కలుగదు. 
 
జీడిపప్పు తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు, ఆస్తమా, కిడ్నీ సమస్యలు, మోకాళ్ల నొప్పులు వున్నవారు జీడిపప్పును తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. జీడిపప్పును కొందరు పచ్చివిగానే తినేస్తారు. మరికొందరు వేయించుకుని తింటారు. ఇంకొందరు స్వీట్ పదార్థాలలో కలుపుకుని తింటారు. ఎలా తిన్నప్పటికీ జీడిపప్పుతో ఆరోగ్యానికి వచ్చే ముప్పేమీ లేదు.