శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: శుక్రవారం, 24 జూన్ 2016 (18:33 IST)

చ‌పాతీలు తినండి... చ‌ర్మ‌సౌంద‌ర్యం పెంచుకోండి!

ఏంటీ చ‌పాతీలు తింటే చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? నిజ‌మేనండి... చ‌పాతీలు తింటే మీ చ‌ర్మం నిగారిస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. చ‌పాతీలో జింక్, ఫైబ‌ర్, ఇత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల ఇది చ‌ర్మానికి చాలా మేలు చేస్త

ఏంటీ చ‌పాతీలు తింటే చ‌ర్మ సౌంద‌ర్యం పెరుగుతుందా? అని ఆశ్చ‌ర్య‌పోతున్నారా? నిజ‌మేనండి... చ‌పాతీలు తింటే మీ చ‌ర్మం నిగారిస్తుంద‌ని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు. చ‌పాతీలో జింక్, ఫైబ‌ర్, ఇత‌ర మిన‌ర‌ల్స్ అధికంగా ఉండ‌టం వ‌ల్ల ఇది చ‌ర్మానికి చాలా మేలు చేస్తుంద‌ట‌. చ‌పాతీల్లో ఐర‌న్ అధికంగా ఉంటుంది. ర‌క్తంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్‌ని ఇది పెంచుతుంది. 
 
రోటీల్లో ఉండే ఫైబ‌ర్, సెలీనియం కంటెంట్ కొన్ని ర‌కాల క్యాన్స‌ర్ల‌ను నివారిస్తాయి. క్యాన్స‌ర్ బారిన ప‌డ‌కుండా శ‌రీరాన్ని కాపాడుతుంది. అన్నింటికీ మించి శ‌రీరాన్ని తేలిక‌గా చేసి, మ‌రుస‌టి రోజు యాక్టివ్‌గా ఉండేలా చేస్తుంది. ఆ...చ‌పాతీలు ఏం తింటాంలే... హాయిగా బిర్యానీలు తినేయ‌చ్చు అనుకునేవారికి ఇది చెప్ప‌దిగిన సూచన‌. 
 
ముఖ్యంగా స్త్రీలకు వెయిట్ పెర‌గ‌డం, ఒబెసిటీ ఓ పెద్ద స‌మ‌స్య. రాత్రిళ్ళు చ‌పాతీలు తింటే ఒబెసిటీ త‌గ్గుతుంది. జీర్ణ‌క్రియ ఓ ఆర్డ‌ర్ లోకి వ‌చ్చేస్తుంది. ఇంకెందుకు ఆల‌స్యం... రాత్రిళ్ళు చ‌పాతీలు తినేయండి... అదీ ఆయిల్ త‌క్కువ‌గా వాడి సుమా!