శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By selvi
Last Updated : గురువారం, 25 మే 2017 (14:30 IST)

రక్తపోటుతో బాధపడుతున్నారా? చెర్రీ జ్యూస్‌ను తరచూ తీసుకోండి..

రక్తపోటుతో బాధపడుతున్నారా? ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే చెర్రీ జ్యూస్ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బీపీ, హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో చెర్రీ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధ

రక్తపోటుతో బాధపడుతున్నారా? ఒత్తిడితో సతమతమవుతున్నారా? అయితే చెర్రీ జ్యూస్ తాగండి అంటున్నారు.. ఆరోగ్య నిపుణులు. బీపీ, హైపర్‌టెన్షన్‌ను నియంత్రించడంలో చెర్రీ జ్యూస్ దివ్యౌషధంగా పనిచేస్తుందని తాజా పరిశోధనలో తేలింది. ఉదయం నుంచి రాత్రి వరకు ఎడతెగని పనులతో ఒత్తిడికి గురువుతున్న చాలామంది.. బీపీ, హైపర్ టెన్షన్ బారినపడుతున్నారు. 
 
ఈ ఒత్తిడిని దూరం చేసుకోవాలంటే.. చెర్రీ పండ్ల జ్యూస్ తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. చెర్రీ జ్యూస్ తీసుకున్న రెండు మూడు గంటల్లోపు బీపీ నియంత్రణలో వుంటుందని పరిశోధనలో తేలింది. 
 
ఇంకా అధిక రక్తపోటు దీర్ఘకాలంలో గుండెకు సంబంధించిన రుగ్మతలకు కారణం అవుతోంది. ఈ మేరకు రక్తపోటు బాధితులు చెర్రీ జ్యూస్‌ను తరచూ తీసుకోవడం ఉత్తమం. ఇంకా చెర్రీలోని యాంటీయాక్సిడెంట్లు వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది. ఇంకా బరువును తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.