శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 14 నవంబరు 2014 (16:24 IST)

చిరాగ్గా ఉందా? అయితే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి!

చిరాగ్గా ఉందా? అయితే సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోండి.. అంటున్నారు ఆరోగ్య నిపుణులు. రోగనిరోధక శక్తి పెరగాలన్నా, గర్భిణీలకు శక్తి లభించాలన్నా, కోపం, చిరాకు తగ్గాలన్నా సి విటమిన్ ఫుడ్స్ తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. 
 
చర్మం, చిగుళ్ల, పళ్లూ, ఎముకలూ ఆరోగ్యంగా ఉండాలన్నా సిట్రస్ ఫ్రూట్స్ తీసుకోవాలి. కీళ్లూ, కండరాల నొప్పులూ, జుట్టూ పొడిబారడం వంటి సమస్యలు నివారించాలంటే సి విటమిన్ గల ఫుడ్స్ తీసుకోవాలి. అయితే ఇది మోతాదు మించకూడదు. 
 
ఇందుకోసం నిమ్మజాతిపండ్లు, ద్రాక్ష, జామ, స్ట్రాబెర్రీ, క్యాప్సికం, బ్రకోలీ, పాలకూర, బంగాళాదుంపలు, కీరదోస, ఉసిరి, టమోటోలు వంటివి తీసుకుంటే కోపాన్ని, చిరాకును నియంత్రించవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.