శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 20 ఏప్రియల్ 2015 (17:10 IST)

వేసవిలో కొబ్బరినీరు తాగండి.. ఇమునిటీని పెంచుకోండి.!

వేసవిలో కొబ్బరినీరు తాగడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కొబ్బరిని ఆహారంలో వాడటం ద్వారా గుండెజబ్బులు, క్యాన్సర్, జీర్ణనాళ సమస్యలు, ప్రోస్టేట్ గ్రంథి ఇబ్బందులను దూరం చేసుకోవచ్చు. అలాగే కొబ్బరి నీటిని ముఖ్యంగా వేసవిలో తీసుకోవడం ద్వారా రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉంటుంది. 
 
కొబ్బరిలో మోనోలారిన్ అనే ఒక ప్రత్యేక కొవ్వు పదార్థముంది. ఇది తల్లిపాలలో లభించే కొవ్వు. ఆ కొవ్వుకు రోగనిరోధకశక్తిని పెంచే గుణముంది. అందువల్లే కొబ్బరి పాలు తల్లిపాలతో సమానమని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం హెచ్ఐవి, హైపటైటిస్, జెనైటిల్ హెర్పిన్ వంటి రోగాల మీద జరుగుతున్న పరిశోధనలో భాగంగా కొబ్బరిని వాడి వాటిని తగ్గించేందుకు పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు.