శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 4 ఏప్రియల్ 2015 (17:31 IST)

వేసవిలో కెఫిన్ డ్రింక్స్ వద్దే వద్దు.. కొబ్బరినీరే ముద్దు!

వేసవి కాలంలో దాహం ఎక్కువైతే కెఫిన్ ఉన్న డ్రింక్స్ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి హెల్దీ అండ్ నేచురల్ అయిన కొబ్బరి నీళ్లు తీసుకోవచ్చు. ఇవి దాహాన్ని తీర్చడం మాత్రమే కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వేసవిలో సూక్ష్మక్రిములతో ఇబ్బందులు తప్పవు. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్‌కు గురి చేస్తాయి. కాబట్టి, కోకనట్ వాటర్ తీసుకోవడం ద్వారా శరీరం, ఇన్ఫెక్షన్స్ నుండి రక్షణ కల్పించేందుకు వీలుంటుంది.
 
అలాగే కోకోనట్ వాటర్ యూరినరీ ట్రాక్ సిస్టమ్‌కు చాలా మేలు చేస్తుంది. కోకనట్ వాటర్‌లో ఉండే డ్యూరియాటిక్ లక్షణాలు కిడ్నీ స్టోన్స్‌ను నివారించడంలో చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. కోకనట్ వాటర్‌లో కొలెస్ట్రాల్ లెవల్స్, బ్లడ్ ప్రెజర్‌ను కంట్రోల్ చేసే లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. అందుకే హాట్ సమ్మర్‌లో కోకనట్ వాటర్ త్రాగడం చాలా మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఇంకా శరీరంలో ద్రవాలు కోల్పోయినప్పుడు డీహైడ్రేషన్‌కు గురి అవుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవాలంటే సరిపడా కోకనట్ వాటర్‌ను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.