శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By PNR
Last Updated : శుక్రవారం, 7 నవంబరు 2014 (18:25 IST)

చలికాలంలో చర్మం పొడిబారకుండా ఉండాలంటే..?

అపుడే చలి కాలం వచ్చేసినట్టుగా ఉంది. ఈ కాలంలో చర్మం పొడిబారుతుంది. నూనెలు వాడితే జిడ్డుగా అనిపిస్తుంది. మాయిశ్చరైజర్ వాడినా ఫలితం కనిపించడం లేదు. పైపెచ్చు.. దురద వస్తుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు చిన్నపాటి సలహా పాటించినట్టయితే చాలు. 
 
సాధారణంగా చలి కాలం సూర్యకాంతి ప్రభావం తక్కువగా ఉంటుంది. అందుకే ఈ కాలంలోనే చర్మం దెబ్బతినే అవకాశాలు ఎక్కువ. అందుకని సూర్యరశ్మి నుంచి చర్మాన్ని రక్షించే క్రీమ్‌లను వినియోగిస్తే మేలు. అలాగే, స్నానం చేయడానికి 10 నిమిషాలు ముందు కొబ్బరినూనెను శరీరమంతా రాసుకుంటే చాలా మంచిది. 
 
చలి కదా అని మరీ వేడినీళ్లతో స్నానం చేయకూడదు. చర్మంపై ఉండే నూనెలను వేడి మరింతగా ఆవిరి చేస్తుంది. స్నానానికి గోరువెచ్చని నీటిని వాడితే చాలా మంచిది. చర్మాన్ని పొడిబార్చే  క్లెన్సర్లు, స్క్రబ్‌లు ఈ కాలం ఉపయోగించకూడదు.