గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 20 నవంబరు 2014 (16:06 IST)

అలసట, ఒత్తిడి, నీరసంకు చన్నీళ్లతో చెక్!

నీళ్లు ఎంతటి అలసటనైన ఇట్టే దూరం చేస్తాయి. అలసటగా, అసహనంగా ఉన్నప్పుడు చన్నీళ్లతో స్నానం చేసి చూడండి. హాయిగా అనిపిస్తుంది. సంగీతం ఒత్తిడిని దూరం చేస్తుందని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి. 
 
ఒత్తిడి మూలంగా తలనొప్పి వచ్చినప్పుడు మంద్రస్థాయిలో వినిపించేలా పాటల్ని పెట్టుకుని చూడండి. మనసుకు నచ్చిన పాటల్ని వింటే, అలసటా ఒత్తిడీ ఇట్టే తగ్గుముఖం పడతాయి. 
 
ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు ఒత్తిడి పెరిగి, తలనొప్పి వస్తే ఓ పెన్నూ కాగితం తీసుకోండి. మనసులో ఉన్నదున్నట్టు రాసేయండి. బొమ్మలు గీయండి. కాసేపు నచ్చిన పుస్తకం చదవండి. ఇవన్నీ మానసికంగా సాంత్వనమందిస్తాయి.