ధనియాల కషాయంతో మధుమేహాన్ని నిరోధించవచ్చు...

శుక్రవారం, 10 ఆగస్టు 2018 (10:08 IST)

కొత్తిమీర మెుక్క నుండి కాచే ధనియాల కాయలను ఎండబెట్టి ఆ తరువాత గింజల రూపంలో లేదా పౌడర్ రూపంలో వీటిని ఉపయోగించుకుంటారు. ధనియాల్లో అనేక పోషక విలువలున్నాయి. వీటి వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. మరి ఈ ధనియాలలో గల ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుందాం.
 
ధనియాల కషాయం రూపంలో తీసుకుంటే శరీరంలోని వేడి తగ్గుతుంది. జలుబు, జ్వరం, దగ్గు, ఆయాసం, విరేచనాలకు ఈ కషాయం అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కషాయాన్ని తీసుకోవడం వలన రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిచవచ్చని పరిశోధనలలో  చెప్పబడుతోంది. మధుమేహం రాకుండా నిరోధించడానికి ధనియాలు చక్కగా పనిచేస్తాయి. ఈ కషాయాన్ని తీసుకోవడం వలన మధుమేహం అదుపులో ఉంటుంది. 
 
టైఫాయిడ్‌కు కారణమయ్యే హానికరమైన సాల్మోనెల్లా బ్యాక్టీరియాతో పోరాడే గుణాలు ధనియాల్లో అధికంగా ఉన్నాయి. కొన్ని సందర్భాలలో ఆహారం వలన కలిగే అనారోగ్య సమస్యలకు ధనియాలు చక్కని పరిష్కారాన్ని చూపుతాయి. ధనియాల కషాయంతో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించవచ్చును. అంటువ్యాధులకు కారణమయ్యే సూక్మక్రిములతో పోరాడే గుణాలు ధనియాల్లో పుష్కలంగా ఉన్నాయి. 
 
శరీర రోగనిరోధక శక్తిని పెంచుటలో ధనియాలు మంచి ఔషధంగా ఉపయోగపడుతాయి. ధనియాలను తీసుకోవడం వలన వివిధ రకాల యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అందుతాయి. తద్వారా శరీరంలోని ఫ్రీరాడికల్స్ తగ్గుముఖం పడుతాయి. ధనియాల పొడిలో కొద్దిగా పసుపును కలుపుకుని పేస్ట్‌లా తయారుచేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే మెుటిమలు తొలగిపోతాయి. దీనిపై మరింత చదవండి :  
ధనియాలు పొడి కషాయం యాంటీ ఆక్సిడెంట్స్ రక్తంప్రసరణ జలుబు దగ్గు జ్వరం ఆయాసం మెుటిమలు మధుమేహం ఆరోగ్యం చిట్కాలు Coriander Seeds Infusions Health Benefits Uses Antioxidants Diabetics Blood Pressure Cold Cough Fever Black Marks

Loading comments ...

ఆరోగ్యం

news

ప్రతిరోజూ కరివేపాకును తీసుకుంటే?

కరివేపాకులో కార్బోహైడ్రేట్స్, ఫైబర్, క్యాల్షియం, పాస్పరస్, ఇనుము, మెగ్నిషియం, రాగి వంటి ...

news

చింత గింజలతో ఆరోగ్య ప్రయోజనాలు...

మనం ప్రతిరోజు వంటలలో చింతపండు వాడుతూ ఉంటాము. కేవలం చింతపండు వలన మాత్రమే కాకుండా చింత ...

news

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా..? గుండెపోటు తప్పదట?

ఇయర్ బడ్స్ ఉపయోగిస్తున్నారా? అయితే గుండెపోటు తప్పదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ...

news

పరగడుపున రాగి చెంబులో నీళ్లు తాగితే?

రాగి పాత్రలను ఉపయోగించడం ద్వారా అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాగి పాత్రలో కేవలం ...

Widgets Magazine