గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 21 మే 2015 (16:08 IST)

వేసవిలో ఆకలి పెరగాలంటే పెరుగులో ఉప్పు లేదా పంచదార?

వేసవి కాలంలో పెరుగు తీసుకోవడం ద్వారా శరీరం పోషకాలను గ్రహిస్తుంది. పెరుగులో క్యాల్షియం అధికంగా ఉండటం ద్వారా.. దీన్ని రెగ్యులర్ డైట్‌లో చేర్చుకోవడం ద్వారా ఎముకలు, దంతాలు బలపడతాయి. వేసవిలో ఆకలి అనిపించకపోతే.. ఆకలిని పెంచేందుకు పెరుగులో ఉప్పు లేదా పంచదార మిక్స్ చేసితీసుకోవడం మంచిది. వేసవిలో ఒత్తిడి ఆరోగ్యాన్ని వివిధ రకాలుగా పాడుచేస్తుంది. అలాంటి ఒత్తిడిని పెరుగు తగ్గిస్తుంది. 
 
ఇకపోతే.. సమ్మర్‌లో, శరీరం నుండి నీరు చెమట రూపంలో కోల్పోతుంది. కాబట్టి, మజ్జిగను రెగ్యులర్‌గా త్రాగడం వల్ల శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచి శరీరంలో నీటి స్థాయిలను సమతుల్యం చేస్తుంది. ఊబకాయంతో బాధపడే వారిలో హార్మోనుల అసమతుల్యత ఉంటుంది. అలాంటివారు, వారి రెగ్యులర్ డైట్‌లో పెరుగు చేర్చుకోవడం ద్వారా కార్టిసోల్ లెవల్స్ కంట్రోల్ అవుతుంది. పెరుగు శరీర వేడిమిని తగ్గిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు.