శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2017 (10:49 IST)

పెరుగుతో హైబీపీ దూరం.. వేసవిలో మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని తాగితే?

పాలు పాల పదార్థాలతో తయారయ్యే ఆహార పదార్థాలను మనం రోజూ తీసుకోవడం ద్వారా రక్తపోటును దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారంలో పెరుగు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును దూరం చేసుకోవచ్చు. వారానికి ఐదారు కప్పుల పెర

పాలు పాల పదార్థాలతో తయారయ్యే ఆహార పదార్థాలను మనం రోజూ తీసుకోవడం ద్వారా రక్తపోటును దూరం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆహారంలో పెరుగు తీసుకోవడం ద్వారా అధిక రక్తపోటును దూరం చేసుకోవచ్చు. వారానికి ఐదారు కప్పుల పెరుగు తీసుకునేవారిలో హై బీపీ వచ్చే ప్రమాదం 20 శాతం తక్కువగా ఉంటుందని ఇటీవల నిర్వహించిన ఓ పరిశోధనలో వెల్లడైంది. 
 
పెరుగులో ప్రోటీన్స్, ఎస్సెన్షియల్ విటమిన్లు, ఖనిజాలు మనలో శక్తిని పెంపొందింపజేస్తాయి. జీర్ణ వ్యవస్థ మందకొడిగా ఉండే వాళ్ళకు పెరుగు అమృతం వంటిది. ముఖంగా పిల్లలు, వయసు మళ్లిన వారిలో పెరుగు వారి జీర్ణ శక్తిని అనుసరించి పనిచేస్తుంది.
 
వేసవి కాలంలో పెరుగుతో చేసిన మజ్జిగ లేదా పెరుగులో చక్కెర కలుపుకుని లస్సీలాగా సేవిస్తే శరీరంలో వేడి తగ్గి ఉపశమనం కలుగుతుంది. ఎండల్లో తిరిగేవారు లస్సీని సేవిస్తుంటే ఆరోగ్యంగా ఉంటారంటున్నారు వైద్య నిపుణులు.
 
పెరుగులో కాల్షియం అధికంగా ఉంటుంది. ప్రతిరోజు పెరుగును సేవించడం వలన ఉదరసంబంధిత జబ్బులు మటుమాయమౌతాయి. జలుబు, శ్వాసకోశ సంబంధిత జబ్బులతో బాధపడేవారికి పెరుగు దివ్యౌషధంలా పనిచేస్తుంది.
 
అల్సర్‌తో బాధపడేవారు పెరుగు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. నోట్లో పొక్కులు ఏర్పడి నోరుపుండైతే పెరుగును నోట్లో పోసుకుని పుక్కిలిస్తుంటే ఉపశమనం కలుగుతుంది. 
 
వేసవిలో ఎండ వేడికి చర్మం పాడవకుండా చేయడంలో పెరుగు భేష్‌గా పని చేస్తుంది. చర్మానికి సరఫరా అయ్యే నరాలకి శక్తినిస్తుంది. పెరుగులో ఉండే బాక్టీరియా చర్మ పోషణకు ఉపయోగపడుతుంది. పెరుగులో నిమ్మరసాన్ని కలిపి ముఖానికి పై పూతగా పూస్తే చర్మం పై ఉండే మలినాలు త్వరగా కరిగిపోతాయి. చర్మంపై తేమ శాతం పెరుగుతుంది. కాంతివంతంగా తయారవుతుంది. ముఖంపై మొటిమలున్నవారికి పెరుగులో కొంచెం శనగ పిండి కలిపి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గిపోతాయి. 
 
పెరుగు తలకి రాస్తే మంచి కండిషనర్‌గా కూడా పనిచేస్తుంది. తలస్నానానికి ముందుగా పెరుగుని తలకి మర్థించి తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. చుండ్రు సమస్యతో సతమతమయ్యేవారు పెరుగులో కొంచెం ఉసిరికాయ పొడినికలిపి తలకి పట్టించి అరగంట తర్వాత స్నానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. పెరుగు ప్రతి రోజు ముఖానికి రాసి ఒక పదిహేను నిమిషాల తర్వాత కడిగేసుకుంటే ముఖం మృదువుగా అందంగా కాంతివంతంగా అవుతుంది.