ప్రతిరోజు ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తింటే...?

శుక్రవారం, 7 జులై 2017 (20:11 IST)

తాలింపులో సుగంధద్రవ్యంగా కరివేపాకును వాడుతారు. ఈ విధంగా అవసరానికి మన ఇంట్లో లేకపోయినా పక్కింటి వాళ్ళనయినా రెండు రెమ్మలు అడిగి తీసుకొని మరీ వాడుకునే ఈ కరివేపాకును తినేటప్పుడు మాత్రం తీసి పక్కన పడేస్తూ వుంటారు. కరివేపాకు అంత తీసిపారేయదగ్గ పదార్ధం కాదు. కరివేపాకులో ఎన్నో ఔషధగుణాలు వున్నాయి.
 
ప్రతి యింట్లో వేపచెట్టు వుండాలని పెద్దలు చెబుతారు. వేపచెట్టు నుండి వీచే గాలి ద్వారానే పలు రోగాలు నయం అవతాయంటారు. అలానే కరివేపాకు చెట్టు నుండి వీచే గాలి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. వాతవరణం కాలుష్యభరితం అయినపుడు ఆ ప్రదేశాలలో కరివేపాకు చెట్టు నాటితే వాతవరణం శుభ్రపడుతుంది.
 
కరివేపాకు చెట్టులో ఆకులు, బెరడు, వేరు, గింజలు, పూలు అన్నీ ఔషధగుణాలు కలిగివున్నాయి. కరివేపాకు పేగులకు, ఉదరమునకు బలాన్నివ్వడమే కాక శరీరానికి కాంతిని కలిగిస్తుంది, రంగునిస్తుంది. ఆహార పదార్థాలకు రుచిని కలిగించడమే కాక, అజీర్తిని నివారించి ఆకలిని పుట్టిస్తుంది.
 
ఎలర్జీని కలిగించే వ్యాధులనూ, ఉబ్బసం, ఉదయాన్నే లేచిన వెంటనే తుమ్ములు ప్రారంభం అవుతన్నప్పుడు జలుబుతో తరచుగా బాధపడుతున్నవారూ, ప్రతిరోజ ఆహారంలో మొదటి ముద్దను కరివేపాకు పొడితో తినడం వలన ఎంతో ఉపయోగం వుంటుంది.
 
గర్భధారణ జరిగిన తరువాత కడుపుతో వున్న తర్వాత కడుపుతో వున్న తల్లికి, బిడ్డకు తగినంత రక్తం అందాలంటే మందులతోపాటు కరివేపాకు పొడిని కూడా యివ్వాలి. బాలింతలకు కూడా ఇది వాడవచ్చు. ఎలాంటి పథ్యము లేదు. రక్తవిరేచనాలు, జిగట విరేచనాలు, అవుతున్నప్పుడు కరివేపాకు పొడిని వట్టిది వాడకం కంటే మజ్జిగలో కలుపుకొని రెండు లేక మూడుసార్లు వాడితే మంచి ఫలితం వుంటుంది. గ్యాస్ ట్రబుల్ వున్నవారు, కడుపు ఉబ్బరంగా వుండి వాయువులు వెలువడుతుంటే వారు ఆహారంలో తరచుగా వాడుతుండాలి. 
 
మొలలు వ్యాధితో బాధపడే వారికి ఈ ఆకు బాగా పనిచేస్తుంది. కరివేపాకు చెట్టు బెరడు కూడా వైద్యానికి పనికివస్తుంది. దీనిని మెత్తగా నూరి కాస్తంత నీరు కలిపి దురదలు, పొక్కులు వున్నప్పుడు వాటిపై రాసి ఆరిన తరువాత స్నానం చేస్తే తగ్గుతాయి. కరివేపాకు కేన్సర్ వ్యాధిలో ఎంతో ఉపయోగకారి అని నవీన పరిశోధనలు చెబుతున్నాయి.
 
కరివేపాకు కారం తయారు చేసే విధానం: కరివేపాకు ఎక్కువ పాళ్ళు వుండే విధంగా వుంటే మంచి ఫలితం వుంటుంది. జీలకర్ర, ధనియాలు, ఎండబెట్టిన కరివేపాకు ఈ మూడింటినీ విడివిడిగా నేతిలో వేయించాలి. వీటిని మెత్తగా దంచి, మెత్తగా అయిన తర్వాత ఉప్పును తగినంత వేసి భద్రపరుచుకోవాలి. ఏదైనా బ్రేక్‌ఫాస్ట్, అన్నంలోను ఈ పొడిని కలపుకొని తినవచ్చు. మంచి ఫలితం వుంటుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

నిద్ర పట్టడం లేదా.. అయితే, ఇలా చేయండి...

చాలామందికి రాత్రి వేళల్లో నిద్రపట్టదు. మరికొందరు బాగా పొద్దుపోయాకగానీ నిద్రకు ...

news

టాబ్లెట్లు ఎలా వేసుకోవాలి? మాత్ర చేదుగా వుందనీ...

సాధారణ జబ్బులకు సైతం వైద్యులు మాత్రలు రాసివ్వటం అతి సహజం. అయితే మాత్రలు మింగటానికి మనం ...

news

కడుపుకి నిత్యం ఇవి పట్టిస్తుంటే ఇక సుఖనిద్ర ఎలా వస్తుంది నాయనా?

నేటి జీవితంలో 8 గంటల పని తర్వాత ఇంటికి వచ్చి కాస్సేపు జీవన సహచరి లేదా సహచరుడితో, పిల్లలతో ...

news

ఆహ్, అబ్బో, ఔచ్, నడుము నొప్పి, వెన్ను నొప్పి పోయేందుకు అదే మార్గం

సాధారణంగా నిత్యం ఎంతో బిజీగా గడిపే మహిళామణులు శృంగారం దగ్గరకి వచ్చేసరికి అక్కడ నొప్పి.. ...