శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 28 జులై 2014 (17:20 IST)

ఖర్జూరంతో నాజుగ్గా మారండి: ఆయుర్వేద టిప్స్

ఖర్జూరంలో ఐరన్ పుష్కలంగా ఉంది. ఖర్జూరాన్ని డైట్‌లో చేర్చుకుంటే శరీరానికి శక్తిని ఇవ్వడంతో పాటు నాజుగ్గా తయారవుతారు. అందుచేత రోజుకు రెండేసి ఖర్జూరాలను తీసుకోవాలి. 
 
* అలసటను దూరం చేసుకోవాలంటే మునగ ఆకుల్ని మిరియాల రసంలో మరిగించి.. ఆ నీటిని ఆహారంతో చేర్చి తీసుకుంటే.. మోకాళ్ల నొప్పికి చెక్ పెట్టడంతో పాటు అలసట దూరమవుతుంది.  
 
* గరిక పేస్ట్‌లో కాసింత వెన్న చేర్చి ఉదయం, సాయంత్రం తీసుకుంటే శరీరానికి బలం చేకూరుతుంది.  
 
* ఒక గ్లాసు గుమ్మడి రసాన్ని రోజు మార్చి రోజు తీసుకుంటే నీరసం తొలగిపోతుంది.  
 
* అనారోగ్యం బారిన పడిన వారు కోలుకోవాలంటే ఆరెంజ్ జ్యూస్, టమోటా జ్యూస్ ఇవ్వడం మంచి ఫలితాన్నిస్తుంది.