శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 జనవరి 2015 (15:50 IST)

డయాబెటిస్ డైటే హెల్దీ డైట్..!

డయాబెటిస్ డైట్‌ అంటే వామ్మో అనుకుంటున్నారా..? ఇక భయపడకండి. మధుమేహం వచ్చాక అలాంటి డైట్ ఫాలో కావడం కంటే ముందు జాగ్రత్తగా ఆ డైట్‌ను ఫాలో అయితే ఆరోగ్యంతో పాటు ఆయుర్దాయం కూడా దక్కుతుందని వైద్యులు సలహా ఇస్తున్నారు. 
 
ఆరోగ్యంగా ఉండాలంటే.. తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండాలి. కొవ్వు ఉండకూడదు. తక్కువ కెలోరీలు ఉండాలి... ఇదే హెల్దీ డైట్. అలాగే తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎంత ఉందనేది తెలుసుకోవాలి. 
 
డయాబెటిస్ ఉన్నవారు పిండి పదార్థాలతో కూడిన ఉప్మా, అటుకుల ఉప్మా, ఇడ్లీ, దోసె, అరటి, మామిడిని తీసుకోవచ్చు. అయితే వీటిని వారానికి రెండుసార్లు తీసుకోవచ్చు. రోజువారీ డైట్‌లో చేర్చితే తప్పకుండా వ్యాయామం అవసరం.
 
అలాగే రైస్ తీసుకునేటప్పుడు కూరగాయల్ని అధికంగా తీసుకోవాలి. బ్రౌన్ లేదా రెడ్ బియ్యాన్ని రెగ్యులర్ రైస్‌కు బదులుగా ఉపయోగించవచ్చు. వీటిలో పీచు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి.