శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (14:13 IST)

కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? ఓట్స్, బీన్స్, వేరుశెనగలు తీసుకోండి

30 ఏళ్లు నిండిపోయాయా? కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? అయితే పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడమే ఉత్తమమార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గంటల పాటు కూర్చుని పనిచేయడం ద్వారా.. 30 దాటిన వారికే బీపీ, షుగ

30 ఏళ్లు నిండిపోయాయా? కీళ్ళనొప్పులు వేధిస్తున్నాయా? అయితే పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడమే ఉత్తమమార్గమని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. గంటల పాటు కూర్చుని పనిచేయడం ద్వారా.. 30 దాటిన వారికే బీపీ, షుగర్, ఒబిసిటీ, గుండె జబ్బులు వెంటాడుతున్నాయి. అందుకే పీచు పదార్థాలను డైట్‌లో చేర్చుకోవాలని.. తద్వారా పైన పేర్కొన్న అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చునని వారు సలహా ఇస్తున్నారు. 
 
అందుకే పీచు అధికంగా ఉండే ధాన్యాలు, పప్పులు, కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు తీసుకోవాలి. వీటితో పాటు డైట్‌లో పుల్లని సి విటమిన్‌తో కూడిన బత్తాయి, కమలాపండు, నిమ్మపండు వంటివి రోజూ తీసుకోవాలి. అంతేగాకుండా.. ఓట్స్, బీన్స్, వేరుశెనగలు, ఆపిల్స్, బార్లీ, క్యారెట్లలో కరిగే పీచుపదార్థాలు పుష్కలంగా ఉంటాయి. 
 
గోధుమలు, మొక్కజొన్నలు, చెర్రీ పండ్లు, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, హోల్ వీట్ బ్రెడ్, సన్ ఫ్లవర్ సీడ్స్, అరటి పండ్లలో పీచు పుష్కలంగా ఉంటుందని వీటిని రోజువారీ డైట్‌లో చేర్చుకోవడంతో పాటు అర్థగంట వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా ఉంటారని.. అనారోగ్య సమస్యలు దరిచేరవని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.