రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తాగితే...

బుధవారం, 11 ఏప్రియల్ 2018 (20:14 IST)

మెంతుల వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. దీనిని అనేక రకాల ఆహార పదార్థాలు, పచ్చళ్లలోనే కాకుండా కేశాల అభివృద్ధికి, సౌందర్యలేపనంగా కూడా దీనిని ఉపయోగిస్తుంటారు. చుండ్రు, జుట్టు రాలడం లాంటి సమస్యలను మెంతులు నివారిస్తాయి. దీనివలన కలిగే ప్రయోజనాలు ఏమిటంటే...
Dill
 
1. రోజు రాత్రిపూట 3 స్పూన్ల మెంతులను నీటిలో నానబెట్టి ఉదయం వాటిని మెత్తగా పేస్టు చేసి దానికి ఒక స్పూన్ పెరుగును కలిపి తలకు బాగా పట్టించి అర్థగంట ఆగిన తర్వాత తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గడమే కాకుండా జుట్టు ఒత్తుగా, నల్లగా పెరుగుతుంది. ఇలా వారానికి మూడుసార్లు చేయడం వల్ల మంచి ఫలితాన్ని పొందవచ్చు.
 
2. శరీరంలో ఫ్రీరాడికల్స్ వల్ల చర్మం ముడతలు పడుతుంది. నలుపు వలయాలు ఏర్పడతాయి. వీటిని మెంతులు అడ్డుకుంటాయి. స్కిన్ టోన్‌ను తేలికపరిచే గుణం మెంతులకు ఉంది.   
 
3. రాత్రిపూట మెంతులను నీటిలో నానబెట్టి ఉదయానే పరగడుపున ఆ నీటిని తాగితే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు తగ్గుతాయి. 
 
4. నాలుగు చెంచాల మెంతులను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఉదయం ఆ నీటిని తలకు పట్టించి అరగంట సేపటి తర్వాత తలస్నానం చేస్తే మెంతులలో ఉండే పొటాషియం తెల్ల జుట్టును నల్లగా మారుస్తుంది.
 
5. మెంతి ఆకులకు కొన్ని తులసి ఆకులను కలిపి మెత్తగా పేస్టులా చేసి ముఖానికి పట్టిస్తే ముఖం మీద మచ్చలు, మెుటిమలు తగ్గటమే కాకుండా చర్మం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వారానికి రెండుసార్లైనా చేపలు తినండి.. వీర్యంలో నాణ్యతను?

చేపల్లో వుండే ఒమేగా-3 ఫాటీయాసిడ్స్ శరీర రక్తంలోని ట్రై-గిసరైడ్‌లను తగ్గించటమే కాకుండా, ...

news

కాఫీ తాగేవారు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు...

మన దైనందిన జీవిత ప్రక్రియల్లో కాఫీ తాగటం కూడా ఒకటని వేరే చెప్పనక్కర్లేదు. ఒక్కపూట ఆహారం ...

news

తేగలు తినండి.. బరువు తగ్గండి..

తేగలు తినేందుకు కొందరు ఇష్టపడరు. అయితే వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే మాత్రం ...

news

ఇంగువతో యవ్వనం.. ఆ నొప్పులను కూడా తగ్గిస్తుందట..

ఇంగువను వంటల్లో చేర్చుకుంటే నిత్యయవ్వనులుగా వుంటారని తెలుస్తోంది. ఇంగువతో చర్మం ముడతలు ...