శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శనివారం, 28 ఫిబ్రవరి 2015 (15:48 IST)

బిగుతుగా ఉండే జీన్స్, టాప్స్ వాడుతున్నారా.?

చాలామంది అమ్మాయిలూ, అబ్బాయిలూ బిగుత్ జీన్స్ వేసుకుంటారు. వీటివల్ల ఎంతో అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాదు.. శరీరం లోపల నరాల వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. రక్త ప్రసరణ సమస్యలు ఎదురవుతాయి. అందుకే ఫ్యాషన్స్‌ని అనుసరించండి. కానీ అవి మీ శరీరానికి హాని చేయకుండా జాగ్రత్త పడండి.
 
బిగుతుగా ఉండే జీన్స్, టాప్స్, హై హీల్స్ ఇవన్నీ శరీరానికి హాని చేస్తాయి. బరువు ఎక్కువగా ఉండే బ్యాగుల వల్ల, ల్యాప్ టాప్ బ్యాగుల వల్ల వెన్నునొప్పి తప్పదు. హ్యాండ్ బ్యాగ్‌ల్లో ఐపాడ్, మొబైల్ ఫోన్, మేకప్ కిట్, వాటర్ బాటిల్, పుస్తకాలు.. ఇలా ఎన్నో ఉంటాయి. ఇంత బరువు మోయడం వల్ల భుజాల నొప్పి, మెడ నొప్పి వస్తాయి. 
 
బరువున్న బ్యాగును భుజానికి ఒకవైపే తగిలించుకోవడం వల్ల కూడా వెన్నుపూస వంగిపోయినట్టు మెడనొప్పి, వెన్ను నొప్పి వస్తాయి. బ్యాక్ ప్యాక్‌ వల్ల పిల్లల్లో వెన్ను, భుజాల నొప్పి తప్పదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అందుకే తేలికపాటి బ్యాగులను ఎంచుకోవడం.. జీన్స్ బిగుతుగా వేయకుండటం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూర్చుకోవచ్చునని వారు చెబుతున్నారు.