Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే...

సోమవారం, 3 జులై 2017 (15:33 IST)

Widgets Magazine

సాధారణంగా ప్రతి ఒక్కరి ఇంట్లోని వంటింట్లో యాలకులు ఉంటాయి. వీటిని మసాలా కూరల్లో, స్వీటు ఐటమ్స్‌లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరైతే యాలకులు వేసిన ఛాయ్‌ను ఇష్టంగా తాగుతుంటారు. ఇలా కొన్ని వంటకాలకు మంచి రుచిని, సువాసనను అందిస్తాయి యాలకులు.
 
యాలకుల్లో సువాసనలే కాదు.. ప్రత్యేక ఔషధ గుణాలు ఉన్నాయట. యాలకుల్లో పొటాషియం, మ్యాగ్నీషియం వంటి పోషయాలు ఎన్నో ఉన్నాయి. ఇందులోని పొటాషియం గుండె కొట్టుకునే వేగాన్ని పెంచుతుంది. అలాగే రక్తపోటు సమస్య కూడా అదుపులో ఉంటుంది. యాలకుల్లోని పీచు పదార్థాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్థక సమస్యను నివారిస్తుంది. ప్రతిరోజు పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చని పాలల్లో అరచెంచా యాలకుల పొడి, చిటికెడు పసుపు, కొద్దిగా చక్కెర వేసుకుని తాగితే రక్తహీనత తగ్గుతుంది. రక్తసరఫరా సక్రమంగా జరిగేలా చేస్తుంది. 
 
రోజూ రెండు యాలకులను బుక్కన వేసుకుని నమిలితే మంచి ఫలితం అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. యాలుకలను నమిలితే నోటి దుర్వాసన పోయి చిగుళ్ళు, దంతాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ రెండు యాలకులు తింటే శరీరంలోని హానికరమైన చెడు పదార్థాలు పోతాయి. అంతే కాదు ఎముకల బలానికి, శరీరానికి ఇన్ఫెక్షన్ రాకుండా కాపాడుతుంది. జుట్టు కూడా రాలదు. అంతేకాదు ఒత్తుగా జుట్టు కూడా వస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

అభ్యంగన స్నానం చేసిన వెంటనే భోజనం చేయొచ్చా?

శరీరంలోని మాలిన్యాలు చర్మపు సూక్ష్మ రంధ్రాల ద్వారా బయటకు వస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఈ ...

news

సముద్ర ఆహారంతో గుండెపోటును అడ్డుకోవచ్చు....

గుండె ఆరోగ్యంగా వుండాలంటే సముద్రపు ఆహారం తీసుకోవాలని వైద్య నిపుణులు చెపుతున్నారు. ఈ ఆహారం ...

news

వర్షాకాలంలో వేడినీళ్లు ఎందుకు తాగాలి?

వర్షాకాలం అనగానే జబ్బులు ఇబ్బంది పెడుతుంటాయి. అందుకే వర్షాకాలంలో గోరువెచ్చని నీళ్లు తాగడం ...

news

కరివేపాకు, వేపాకు ముద్దను మజ్జిగలో కలిపి తీసుకుంటే?

చర్మసమస్యలు వేధిస్తుంటే? లేత కరివేపాకు, వేపాకు ఆకులను ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను ...

Widgets Magazine