శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 30 అక్టోబరు 2014 (14:06 IST)

కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి.. లేకుంటే కష్టమే..!

కళ్ళకు విశ్రాంతి ఇవ్వండి లేకుంటే కష్టమేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. కంటి ఆరోగ్యం కోసం విటమిన్ ఎ మరియు కె అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. ఈ రెండు విటమిన్లు ఉన్న ఆహారాలను తీసుకుంటే కనుచూపు సమస్యలు దరిచేరవు. విటమిన్స్ మరియు మినిరల్స్ అధికంగా ఉండే పండ్లు.. కూరగాయలను రెగ్యులర్‌గా తీసుకుంటే, కంటి చూపుతో పాటు కళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుంది. 
 
అలాగే పుస్తకాలు చదివే సమయంలో మరియు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు మధ్యమధ్యలో చిన్న బ్రేక్ తీసుకోవాలి. 5నిముషాల బ్రేక్ తీసుకోవడం వల్ల కళ్ళ కండరాలు రిలాక్స్ అవుతాయి. అలాగే కళ్ళ మీద కొన్ని నీళ్లను చిలకరించుకోవాలి. తర్వాత పని ప్రారంభించాలి.
 
అలాగే కళ్ళకు సంబంధించిన కొన్ని వ్యాయామాలు చేయాలి. కొన్ని సార్లు కనురెప్పలు బ్లిక్ చేస్తుండాలి. ఉదయం నిద్రలేచిన వెంటనే రెండు చేతులను 2నిముషాలు బాగా రబ్ చేసి తర్వాత వెచ్చని చేతులను కళ్ళమీద ఉంచాలి. ఈ ఐ వ్యాయామం కళ్ళను తేమగా, హెల్దీగా ఉంచుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.