Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

సెల్ ఫోన్, కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా?: చేతివేళ్లు భద్రం గురూ...

బుధవారం, 28 జూన్ 2017 (11:03 IST)

Widgets Magazine

కంప్యూటర్లలో గంటల పాటు పనిచేస్తున్నారా? అయితే మీ చేతివేళ్లు భద్రం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. టెక్నాలజీ సాకుతో ఉదయం లేచిన వద్ద నుంచి రాత్రి నిద్రించేంత వరకు.. స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. సెల్ ఫోన్‌తో పాటు కంప్యూటర్లను అత్యధికంగా ఉపయోగించే వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. వీటి వాడకం ద్వారా కంటి సమస్యలు తప్పవ్. 
 
అయితే వీటిని ఉపయోగిస్తే కంటితో పాటు చేతి వేళ్లకు కూడా దెబ్బేనని తెలుసుకోవాలి అంటున్నారు ఆరోగ్య నిపుణులు. సెల్ ఫోన్‌ను అదేపనిగా చూస్తుండటం, చేతివేళ్లతో ఛాటింగ్ చేస్తుండటం.. అలాగే కంప్యూటర్లో మౌస్, కీబోర్డులను అదే పనిగా ఉపయోగించడం ద్వారా చేతి వేళ్ళలో నొప్పి ప్రారంభం అవుతుంది. ఈ నొప్పి నుంచి చేతివేళ్ళకు ఉపశమనం లభించాలంటే? చేతివేళ్లలో నొప్పి వున్న ప్రాంతంలో ఐస్ ప్యాక్ లేదా హాట్ ప్యాక్ పెట్టాలి. 
 
చేతి వేళ్ల నొప్పిని తగ్గేందుకు కొన్ని వ్యాయామాలు చేయాలి. మణికట్టు ప్రాంతంలో నొప్పి వున్నట్లైతే చేతికి స్మైలీ బాల్‌ను నొక్కుతూ వుంటే సరిపోతుంది. ఇలా చేసినా నొప్పి తగ్గలేదంటే.. వెంటనే ఫిజియోథెరపిస్టులను సంప్రదించాలి. క్యాల్షియంతో కూడిన ఆహారం తీసుకోవాలి. రోజూ అరగంట నడవడం చేతుల్ని తిప్పే వ్యాయామాలు చేస్తే మంచి ఉపశమనం లభిస్తుంది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

పురుషులకు గుడ్ న్యూస్.. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొంటే గుండె పదిలం..

భాగస్వాములు ఉద్యోగాలు చేస్తుండటం.. హడావుడిగా పరుగులు తీయడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ...

news

రొమాన్సును ఉన్నట్టుండి ఆపేస్తే.. గుండెకు ప్రమాదమా?

వివాహమైనప్పటి నుంచి రోజూ రొమాన్స్ చేసుకునే వ్యక్తి ఉన్నట్టుండి ఏదైనా అనివార్య కారణాల చేత ...

news

మలబద్దక సమస్యను అధిగమించడం ఎలా...?

మలబద్దక సమస్య అనేది ప్రతి ఒక్కరు ఏదో ఒక సమయంలో ఎదుర్కొంటుంటారు. ప్రతిరోజు మలవిసర్జన సరైన ...

news

బరువు తగ్గాలనుకునేవారు.. నూనెల్ని బాగా తగ్గించి.. పండ్లు, కూరగాయలు తీసుకోండి..

బరువు తగ్గాలనుకునే వారు అన్నం మానేయడం కాదు.. నూనెలు, చక్కెర్లు మానేస్తేనే ఫలితం ఉంటుంది. ...