బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 19 అక్టోబరు 2016 (14:56 IST)

చేపల కూర ఓకే.. లేదా గ్రిల్ ఫిష్ బెటర్.. కానీ ఫిష్ ఫ్రై వద్దే వద్దు..

లో క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. లోఫ్యాట్ చీజ్ శరీరానికి కొంత కొవ్వును జోడించినప్పటికీ ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉల్లి కూడా లోఫ్యాట్ ఫుడ్డే. ఉల్లిపాయలు రుచికి మాత్రమే కా

లో క్యాలరీ ఫుడ్స్ తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. లోఫ్యాట్ చీజ్ శరీరానికి కొంత కొవ్వును జోడించినప్పటికీ ఎముకలను బలోపేతం చేస్తుంది. ఉల్లి కూడా లోఫ్యాట్ ఫుడ్డే. ఉల్లిపాయలు రుచికి మాత్రమే కాదు, ఇందులో సెలీనియం ఎక్కువగా ఉంటుంది. వీటిని ఆహారంలో తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. 
 
ఇకపోతే.. చేపల్లో మంచి ఫ్యాట్స్ ఉన్నాయి. ఇందులో ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇంకా చేపలు మంచి లీన్ ప్రోటీన్స్‌ను కూడా అందిస్తుంది. చేపలను ఉడికించి లేదా గ్రిల్ చేసే తీసుకోవచ్చు. చేపల పులుసు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ ఫ్రై చేస్తే న్యూట్రీషియన్స్ తొలగిపోతాయి. లో క్యాలరీలతో కూడిన చేపలను వారానికి రెండు సార్లు తీసుకోవడం ద్వారా ఒబిసిటీని దూరం చేసుకోవచ్చు. 
 
ఇదేవిధంగా గోధుమ రవ్వను, పెరుగు తీసుకోవడం వంటివి చేస్తే బరువు తగ్గడం సులభమవుతుంది. అలాగే వారానికి రెండు లేదా మూడు సార్లు మష్రూమ్‌‍ను డైట్‌లో చేర్చుకోవాలి. వీటిలో ప్రోటీనులు, విటమిన్ డి ఉన్నాయని న్యూట్రీషన్లు అంటున్నారు.