బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By JSK
Last Modified: సోమవారం, 25 జులై 2016 (12:53 IST)

స్త్రీలైనా, పురుషులైనా అది తింటే ఇక వెనక్కి చూడాల్సిన పని ఉండదు...

ఆసక్తికరమైన పండ్లు అన్యదేశపు కూరగాయలు సెక్స్ లైఫ్‌కు చాలా సహాయపడుతాయి. ఇవి కనుక రెగ్యులర్ డైట్‌లో చేర్చుకొన్నట్లైతే రక్త సరఫరా, కండరపుష్టికి, మంచి లైంగిక వాంఛ మరియు లైంగిక శక్తిని పెంచడానికి మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడుతాయి. వీటిని తినడం వల్ల స

ఆసక్తికరమైన పండ్లు అన్యదేశపు కూరగాయలు సెక్స్ లైఫ్‌కు చాలా సహాయపడుతాయి. ఇవి కనుక రెగ్యులర్ డైట్‌లో చేర్చుకొన్నట్లైతే రక్త సరఫరా, కండరపుష్టికి, మంచి లైంగిక వాంఛ మరియు లైంగిక శక్తిని పెంచడానికి మార్గాన్ని సుగమం చేయడానికి సహాయపడుతాయి. వీటిని తినడం వల్ల సెక్స్ పవర్‌ను పెంచుకోవ‌చ్చు.
 
* అరటి పండులో ఉండే పొటాషియం మరియు విటమిన్ బి6 హార్మోనుల అసమతుల్యతను క్రమబద్ద చేయడానికి, శరీరానికి కావల్సిన ఎనర్జీ అందివ్వడానికి లైంగిక‌ జీవితానికి బాగా సహాయపడుతాయి. 
* వెల్లుల్లి తింటే పురుషులైనా, స్త్రీలైనా ఉద్రేకాలకు లోనవుతారు. వెల్లుల్లిలో ఉండే ఎల్లిసిన్ అనే రసాయనం జననాంగాలకు రక్తప్రసరణ అధికం చేస్తుంది. జననేంద్రియాలకు కావలసినంత రక్తం వెళ్ళటం వలన ఖచ్చితంగా అంగస్తంభన సంబంధించిన ఏ సమస్య ఉండదు. వెల్లుల్లి అంగస్తంభన నిర్వర్తించే నైట్రిక్ ఆక్సైడ్ సింథేస్ ఉత్పత్తిని ప్రేరేపించగలదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
 
* కోడిగుడ్లలో విటమిన్ బి6 మరియు విటమిన్ బి5 పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్మోనుల లెవల్స్‌ను బ్యాలెన్స్ చేస్తాయి. ఒత్తిడితో పోరాడుతాయి. అధిక లైంగిక వాంఛను కలిగిస్తాయి.
* నట్స్‌లో కావల్సినన్ని ఎసెన్సియల్ ఆయిల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి పురుషుల్లో టెస్టోస్టిరాన్‌ను ఉత్పత్తికి బాగా సహాయపడుతాయి. దాంతో సెక్స్ లైఫ్ సుఖవంతం అవుతుంది.
 
* దానిమ్మ జ్యూస్ తీసుకోవ‌డం వ‌ల్ల  పురుషులకు ఆరోగ్యకరంగా స‌హ‌జ‌త్వంగా అంగస్తంభన సమస్యను నివారిస్తుంది. దానిమ్మలో చాలా తక్కువగా ఐరన్ కలిగి ఉండి, ఇది శరీరంలో ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. దాంతో శరీరంలో మరింత రక్తం ఉత్పత్తి అవుతుంది. ఆయిల్ ఫిష్‌లో ఒమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ ఎసెన్సియల్ ఆయిల్ మగవారి సెక్స్ లైఫ్‌కు బాగా సహాయపడుతాయి. 
 
* చాక్లెట్ ఎల్లప్పుడూ శృంగారం మరియు ప్రేమ సంబంధం కలిగి ఉంటుంది. చాక్లెట్లో ఫెని లెథ్య్లమినె  మరియు సెరోటోనిన్ ఉండటం వల్ల మెదడు ఉత్తేజం కొరకు మరియు శక్తి స్థాయి పెంచడానికి సహాయపడతాయి.చాక్లెట్‌లు తియ్యగా ఉండి కామ వాంఛను కలిగిస్తాయి. ప్రేమకు అనురాగానికి ఇవి చిహ్నాలుగా వుంటాయి. మహిళ తనలో ఎండార్ఫిన్లు రిలీజ్ చేయాలంటే చాక్లెట్ బాగా పనిచేస్తుంది. చాక్లెట్ తిన్న తర్వాత నాలుగు రెట్లు ఆనందంగా మహిళలు ఉంటారని స్టడీలు చెపుతున్నాయి.
 
* ఒక గ్లాస్ రెడ్ వైన్‌లో కావల్సినన్ని పోషకాంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడిని తగ్గించడంతో పాటు హార్ట్ రేట్ ను తగ్గిస్తాయి. అంతే కాదు హార్మోనులను నిలకడగా ఉంచుతాయి. ఒక గ్లాస్ రెడ్ వైన్ త్రాగడం వల్ల సెక్స్ సామర్థ్యం పెరుగుతుంది. పురుషుల్లో సంతానోత్పత్తిని పెంపొందిస్తుంది. వీర్యకణాల పెరుగుదలకు సహాయపడుతుంది.
* బ్లాక్ బెర్రీ డార్క్ ఫ్రూట్‌లో యాంథో సైనిన్ మరియు ఆల్ట్రా పవర్ పుల్ యాంటీ యాక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇది స్ట్రాంగర్ ఎరిక్షన్స్‌గా ఉంటుంది. ఒక కప్పు బ్లాక్ బెర్రీ జ్యూస్‌ను ప్రతి రోజూ నిద్రించడానికి ముందు త్రాగడం వల్ల ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.