గురువారం, 28 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 9 మే 2016 (17:41 IST)

మాంసాహారంలో వెల్లుల్లి తప్పక చేర్చాలి.. ఎందుకో తెలుసా?

వీకెండ్‌ల్లో ఫుల్లుగా మాంసాహారాన్ని లాగించేస్తున్నారా? అయితే వాటిలో వెల్లుల్లి శాతం ఎంతుందో తెలుసుకోండి. ఎందుకంటే వెల్లుల్లి కొవ్వుకు విరుగుడుగా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. మాంసాహారంలో ఎక్కువగా నూనె చేర్చడంతో పాటు అందులో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. అందుకే మాంసాహారంలో వెల్లుల్లిని తప్పకుండా చేర్చాలి. అప్పుడే మాంసాహారం తీసుకున్నా.. అందులోకి కొవ్వు ద్వారా ఆరోగ్యానికి కీడు కలుగదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 
 
ఇంకా మాంసాహారంలో వెల్లుల్లిని ఉపయోగించడం ద్వారా.. గుండెజబ్బులు దరి చేరవు. వెల్లుల్లి పట్టు వేసిన తలనొప్పి, కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. వెల్లుల్లిని పాలతో కలిపి ఉడికించి త్రాగించిన అస్తమా, క్షయ, నిమోనియా తగ్గుతాయి. జలుబు తగ్గుతుంది. గుండె జబ్బులు, ఒబిసిటీతో బాధపడే వారు.. ప్రతిరోజూ రెండు లేదా మూడు చిన్నపాయల వెల్లుల్లిని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. స్త్రీలలో కలిగే వ్యాధులలో వెల్లుల్లి అత్యుత్తమంగా పని చేస్తుంది. రుతు సంబంధిత వ్యాధులను పోగొట్టి సంతానాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.