ఈ టీ తాగితే రోగాలను అడ్డుకోవచ్చు....

మంగళవారం, 7 ఫిబ్రవరి 2017 (17:41 IST)

coffee

ఆ టీ ఒంట్లో వుండే పరాన్నజీవులన్నింటినీ చంపేసి, విషపూరిత పదార్థాల నుంచి శరీరాన్ని పరిశుభ్రం చేస్తుంది. ముక్కుదిబ్బడ, వాంతులు వంటి చిన్నచిన్నవి మన జోలికి రావు. సరికదా… కేన్సర్‌, మానసిక వైకల్యం వంటివి రాకుండా శరీరాన్ని సంసిద్ధం చేస్తుంది ఈ పానీయం. అయితే ఈ టీ తయారు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వుంటే చాలు. ఆ టీని ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.
 
కావాల్సిన పదార్థాలు
500 మిల్లీ లీటర్ల నీళ్ళు
సగం టేబుల్‌ స్పూన్‌ దాల్చిన చెక్క
సగం టేబుల్‌ స్పూన్‌ అల్లం
1/6వ వంతు పసుపు
చిటికెడు యాలకుల పొడి
సగం కప్పు పాలు
కొద్దిగా తేనె (అవసరమనుకుంటే)
 
తయారు చేసే పద్ధతి
పైన పేర్కొన్న వాటన్నింటినీ నీటిలో కలిపి టీలా మరిగించుకొని వడపోసి తాగడమే. కావాలనుకుంటే దీనికి అదనంగా వేడిపాలు చేర్చుకోవచ్చు. రోజుకి ఒకటిరెండుసార్లు తాగితే సరిపోతుంది. తిండీతిప్పలు మానేసి అదొక్కటే తాగొద్దు సుమా! టీ తరహాలో తాగితే చాలు! పంచదార మాత్రం ఇందులో వెయ్య‌కూడ‌దని గమనించండి.దీనిపై మరింత చదవండి :  
Ginger Turmeric Tea Health Benefits

Loading comments ...

ఆరోగ్యం

news

మునగపూలను పాలలో వేసుకుని తాగితే....

మునగలో ఎన్నో ఔషధ విలువలున్నాయి. అయితే మునగ ఆకుల కంటే మునగ కాయలను ఎక్కువగా వాడుతుంటారు. ...

news

ఈ పండుతో కిడ్నీ స్టోన్స్‌ని, పొట్టని కరిగించుకోవచ్చు....

పచ్చని కూరగాయలు, ధాన్యాలు అలాగే పిండి పదార్థాలను, పండ్లను తినడం వల్ల శారీరక శక్తి ...

news

రక్తపోటును తగ్గించే మందారం టీ....

మందార మొక్క అనేది ఉష్ణమండల మరియు వెచ్చని ప్రాంతాల్లో పెరిగే అందమైన పుష్పించే మొక్క. ఒక ...

news

పొట్ట చుట్టూ పేరుకున్న కొవ్వు కరగాలా? గుప్పెడు వేరుశెనగలు తినండి..

వేరుశెనగల్లో క్యాల్షియం, ఫాస్పరస్‌, ఇనుము, జింక్‌, బోరాన్‌లలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ...