Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అవి తింటే ఇక రాత్రిళ్లు అంతే... మరేం తినాలో తెలుసా?

గురువారం, 1 జూన్ 2017 (18:15 IST)

Widgets Magazine

సంవత్సరం మొత్తం అందుబాటులో ఉండే అరటిపండ్లు, ఆపిల్‌లు వగైరాలతోపాటు కొన్ని దుంపలు, అన్నం మొలకెత్తిన విత్తనాలను ఏ సమయంలో తీసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయో తెలుసుకోవాలనుందా? మీ శరీరతత్వం, ఆకారంతో సంబంధం లేకుండా ఆ పండు లేదా కాయగూరల్లోని పోషకాలను మీ శరీరం సక్రమమైన పద్ధతిలో ఉపయోగించుకోవాలంటే ఈ కింది పద్ధతులను పాటించి చూడండి. 
 
ఈ చిట్కాలతో మీ ఆరోగ్యం మెరుగుపడటం మాత్రమే కాదు, అనవసరమైన జంక్ ఆహారాన్ని తీసుకోకుండా మీపై మీరు నియంత్రణను తెచ్చుకునేందుకు కూడా సహాయపడతాయి. సాధారణంగా భోజనం ముగించిన వెంటనే ఏదో ఒక పండు తినాలనుకోవడం, లేదా పడుకునే ముందు ఖచ్చితంగా ఒక పండు తింటే చాలు ఆరోగ్యంగా ఉంటాం అనే అపోహలను ఇక వదిలేసి, కింది నిరూపిత శాస్త్రీయ పద్ధతులను పాటించండి...
 
అరటిపండ్లు తక్షణ శక్తిని అందిస్తాయి కాబట్టి వాటిని ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో తీసుకోవడం ఉత్తమం. అలాగే మధ్యాహ్న భోజనానికి, రాత్రి భోజనానికి మధ్యలో తలెత్తే కొద్దిపాటి ఆకలిని అదుపు చేయడానికి సాయంత్రం సమయంలో తీసుకోవడం కూడా మంచిది.
 
ఆపిల్‌లో ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. కానీ పాలు తాగినప్పుడు ఆపిల్‌ను తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఆపిల్‌లోని ఐరన్‌ను శరీరం స్వీకరించకుండా పాలు నిరోధిస్తుంది. మీరు ఉదయాన బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు తీసుకుని ఉంటే, ఆపిల్‌లను మధ్యాహ్న భోజన సమయంలో లేదా రాత్రి భోజనం ముగించిన తర్వాత తీసుకోవడం శ్రేష్టం.
 
కార్బోహైడ్రేట్లతో వెంటనే శక్తిని అందించే బంగాళాదుంపలను రాత్రుళ్లు తింటే ఇక ఆ రాత్రి మీకు నిద్ర కరువే.  కానీ వీటిని బ్రేక్‌ఫాస్ట్‌ లేదా మధ్యాహ్న భోజనంలో తీసుకోవచ్చు. ఉదయాన వ్యాయామం చేసిన తర్వాత బంగాళాదుంపలను తీసుకుంటే అవి మీ అలసిన కండరాలకు తిరిగి శక్తిని ప్రసాదిస్తాయి.
 
మొలకెత్తిన విత్తనాలు, గింజలను ఏ సమయంలోనైనా తీసుకోవచ్చు. నిద్ర లేచిన వెంటనే తినడం వల్ల అందులోని పోషకాలను మీ శరీరం బాగా తీసుకుంటుంది. తద్వారా మీకు రోజంతా శక్తిని, విటమిన్లను అందిస్తుంది. మధ్యాహ్నం భోజనంలోకి వరి అన్నం తీసుకోవడం ద్వారా అందులోని పిండిపదార్థాలు మీ శరీరానికి రోజు మొత్తానికి సరిపోయే శక్తిని అందివ్వడంలో తోడ్పాటునిస్తుంది. కానీ రాత్రుళ్లు అన్నం తీసుకోకపోవడం మంచిది.
 
వీటన్నింటికి మినహాయింపుగా ఒక పండుని రోజులో ఎప్పుడైనా తినవచ్చు. అదేంటో తెలుసా?  నీటిలో కరిగిపోయేటటువంటి విటమిన్ సితో నిండి ఉన్న కమలాపండుని. కానీ నిద్రలేచిన వెంటనే పరగడుపునే ఆరెంజ్ జ్యూస్ తీసుకుంటే మాత్రం అసిడిటీ బారినపడక తప్పదు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

ఇంటర్నెట్ లేకపోతే దానికి బానిసైనవాడి కంటే హీనంగా వుంటాడట...

ఈ రోజుల్లో ఇంటర్నెట్‌ గురించి తెలియనివారు లేదా ఇంటర్నెట్‌‌ను ఉపయోగించని వారు ఎంతమంది ...

news

శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగాలంటే ఇది చేయండి..

నిత్యం ఉరుకుల పరుగుల జీవితంలో ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతుంటాం. ప్రధానంగా తీసుకునే ...

news

అన్నం వేడి వేడిగా తింటున్నారా?

అన్నం వేడి వేడిగా తింటున్నారా? కాస్త ఆగండి.. వేడి వేడి అన్నం తీసుకోవడం ద్వారా శరీరంలో ...

news

అంజీరను వెన్నతో కలుపుకుని తీసుకుంటే? శృంగార సమస్యలుండవ్

అంజీర పండును సలాడ్స్, ఓట్ మీల్, చట్నీలు, సల్సా, పాస్తాల్లో కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి ...

Widgets Magazine