గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 17 అక్టోబరు 2014 (16:42 IST)

కంటినిండా నిద్ర కావాలంటే ఏం చేయాలి?

విశ్రాంతికి సమయం కరువైంది. నిద్రలేక కొందరు బాధపడుతుంటే.. నిద్రపోవటానికి సమయం లేదని మరికొందరు బాధపడుతూ ఉంటారు. అయితే గాఢమైన నిద్రకు ప్రస్తుతం సామాజిక వెబ్ సైట్లు ఆటంకంగా మారుతున్నాయి. నిద్రకు కూడా సమయం లేకుండా చాలామంది ఫేస్ బుక్, ట్విట్టర్లలో కాలం గడిపేస్తున్నారు. అయితే వీటికి కళ్లెం వేసి హాయిగా నిద్రపోవాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఒక్కసారి చూద్దాం..  
 
* నిద్రపోయేందుకు ఫిక్స్ డ్ టైం పెట్టుకోవాలి. టైమ్‌కి నిద్రపోయే ఉదయం త్వరగా మేల్కోవాలి. 
 
* ఆహారం తీసుకున్న వెంటనే నిద్రకు ఉపక్రమించడం సరికాదు. రాత్రి భోజనానికి, నిద్రకు మధ్య రెండు గంటల విరామం ఉండేట్టు చూసుకోవాలి. పడుకునే ముందు స్నానం చేస్తే మరీ మంచిది. 
 
* సాయంత్రం వేళల్లో కాసింత ఒళ్ళు వంచగలిగితే శరీరం అలసినట్టవుతుంది. వ్యాయామం చేయడం ద్వారా కొవ్వు తగ్గడంతో పాటు ఆరోగ్యమూ మెరుగవుతుంది. నిద్ర చక్కగా వస్తుంది. 
 
* రాత్రివేళల్లో లైటు ఉంటేనే కొందరు నిద్రపోతారు. అలాంటి వారు రూల్సు బ్రేక్ చేయాలి. లైట్లు ఆర్పేసి పడుకోవడం అలవాటు చేసుకోగలితే సుఖ నిద్ర సొంతం చేసుకుంటారు. 
 
* బెడ్‌పై స్మార్ట్ ఫోన్లు, ఐపాడ్లు వంటి వాటికి స్థానం కల్పించకూడదు. నిద్రవేళ సంగీతం వినడం కూడా మంచి అలవాటు కాదు. ఆ సమయంలో ప్రశాంతంగా ఉండేందుకే ప్రాధాన్యం ఇవ్వాలి. 
 
* కాఫీకి దూరంగా ఉండాలి. అందులో ఉండే కెఫీన్ నిద్ర వ్యవస్థను దెబ్బ తీస్తుంది. ఆరోగ్యకరమైన డైట్ తీసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే సుఖ నిద్ర మీ సొంతం అవుతుంది.