శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : బుధవారం, 30 జులై 2014 (13:30 IST)

క్యాన్సర్ కారకాలను నియంత్రించే బఠానీలు!

ఆకుపచ్చ బఠానీలు క్యాన్సర్ కారకాలకు చెక్ పెడుతుంది. ఇందులో ఉన్న " విటమిన్ సీ" క్యాన్సర్ కారకాలను నియంత్రించడంతోపాటు ఫ్రీ రాడికల్స్‌ కారణంగా కలిగే హానినికూడా నియంత్రిస్తుందంటున్నారు వైద్యులు. 
 
ఆకుపచ్చ రంగులోనున్న బఠానీలను ఆహారంగా తీసుకుంటుంటే శరీరంలో రక్తకణాలు పెరుగుతాయి. వీటిలో శరరానికి కావలసిన ఇనుము పుష్కలంగా ఉంది. 
 
బఠానీల్లో విటమిన్ ఏ, బీ, సీ, కే తదితరాలున్నాయి. వీటిలోనున్న మాంసకృతులు మాంసాహార పోషకాలకు సరిసమానం. శరీరానికి అవసరమైన పీచుపదార్థం ఇందులో ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉత్తమమైన ఆహారంగా పరిగణిస్తున్నారు వైద్యులు.