బాదం నానబెట్టి ఆరగిస్తే కలిగే ఫలితాలేంటి?

బుధవారం, 17 మే 2017 (11:13 IST)

almonds

బాదం తింటే మంచిదనీ వీటిల్లో విటమిన్‌-ఇ, పీచు, ఒమేగా-3- ఫ్యాటీ ఆమ్లాలు, ప్రొటీన్లూ సమృద్ధిగా ఉంటాయనీ అందరికీ తెలుసు. అయితే బాదంపప్పుల్ని నానబెట్టుకునే ఆరగిస్తే ఎన్నో ఆరోగ్య ఫలితాలు కలుగుతాయట. ఎందుకంటే బాదం తొక్కలో ఉండే టానిన్లు అందులోని పోషకాలు శరీరంలో ఇంకకుండా అడ్డుకుంటాయి. అదే నానబెట్టి ఆ తొక్కను తీసేసి తినడంవల్ల అందులోని పోషకాలన్నీ పూర్తిగా ఒంటపడతాయి. అందుకే బాదంపప్పుల్ని కనీసం 8 గంటలైనా నానబెట్టి ఆరగిస్తే ఎంతో ఉత్తమం అంటారు. 
 
నానబెట్టిన బాదం పప్పులు జీర్ణశక్తికి అవసరమైన ఎంజైమ్‌ల విడుదలను వేగవంతం చేస్తాయి. ముఖ్యంగా లైపేజ్‌ అనే ఎంజైమ్‌ విడుదల వల్ల కొవ్వులు త్వరగా జీర్ణమవుతాయి.
 
వీటిల్లోని మోనో అన్‌శాచ్యురేటెడ్‌ ఫ్యాటీ ఆమ్లాలు ఆకలిని తగ్గించి పొట్టనిండిన అనుభూతిని కలిగిస్తాయి. దాంతో బరువు నియంత్రణకు తోడ్పడతాయి. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడం ద్వారా హృదయపనితీరుకీ సాయపడతాయి.
 
వీటిల్లోని విటమిన్‌-ఈ ఫ్రీరాడికల్స్‌ నుంచి చర్మకణాలను రక్షించడం ద్వారా వృద్ధాప్యాన్ని అడ్డుకుంటుంది.
 
నానబెట్టిన బాదంలో విటమిన్‌ బి17 సమృద్ధిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ కణాలతోనూ పోరాడుతుంది. ఇందులోని ఫ్లేవనాయిడ్లు కంతుల పెరుగుదలనూ అడ్డుకుంటాయి, బీపీనీ తగ్గిస్తాయి. ఫోలిక్‌ఆమ్లం పుట్టబోయే శిశువు ఎదుగుదలకు తోడ్పడుతుంది. దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

మలబద్ధకం సమస్యకు ఉత్తమ మందు ‘కర్బూజ'

వేసవికాలంలో లంభించే పండ్లలో కర్బూజ ఒకటి. ఇందులో నీటి శాతం పుష్కలంగా ఉంటాయి. వీటిని ...

news

నానబెట్టిన నువ్వులను పాలతో కలిపి తీసుకుంటే...?

నువ్వులు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని తెలిసిందే. చూసేందుకు చిన్నవిగా వున్నా వాటి శక్తి ...

news

స్త్రీలకు వార్నింగ్... పురుషులు వాడాల్సినవి పక్కన పడేసి స్త్రీకి గర్భ నిరోధక మాత్రలా?

ఇప్పుడే పిల్లలు వద్దు అని చాలామంది జంటలు పెళ్లయిన తర్వాత అనుకుంటారు. కొంతకాలం సంతోషంగా ...

news

అల్లం చేసే మేలెంతో తెలుసా?

త్రిదోషాలైన వాత, పైత్య, శ్మేష్మాలను హరించే శక్తి అల్లానికి ఉంది అల్లం నోటికి మంచి రుచిని ...