బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : సోమవారం, 30 జనవరి 2017 (17:51 IST)

జలుబు చేసిందా..? అయితే చామంతి రేకుల్ని మరిగించి?

జలుబు చేసిందా..? తరచూ తుమ్ములు వస్తున్నాయా? అయితే అరకప్పు చామంతి రేకులను ఒక గ్లాసుడు నీటిలో మరిగించి.. అరగ్లాసయ్యాక ఆ నీటిని గోరు వెచ్చగా సేవిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చలికాలంలో ముఖంపై

జలుబు చేసిందా..? తరచూ తుమ్ములు వస్తున్నాయా? అయితే అరకప్పు చామంతి రేకులను ఒక గ్లాసుడు నీటిలో మరిగించి.. అరగ్లాసయ్యాక ఆ నీటిని గోరు వెచ్చగా సేవిస్తే జలుబు నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే చలికాలంలో ముఖంపై పగుళ్లు, గీతలు కనిపిస్తుంటాయి. ఎన్ని మాయిశ్చరైజర్లు అప్లై చేసినా కొద్దిసేపటికే ఇంకిపోతుంది. రోజంతా ముఖం మృదువుగా ఉండాలంటే చామంతి ప్యాక్ మంచి ఫలితాన్నిస్తుంది.
 
రెండు చేమంతి పూలను నీళ్లలో ఉడకపెట్టాలి. ఆ నీటిలో కాస్త తేనె, పాలు పోసి బాగా కలుపుకోవాలి. రోజూ ఉదయం బయటికి వెళ్లేటప్పుడు ఈ మిశ్రమంతో ముఖంపై బాగా మసాజ్ చేసుకొని రెండు నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ఇలా చేస్తే రోజంతా ముఖం తాజాగా, అందంగా ఉంటుంది.