ఎండు ద్రాక్షలు తినండి.. చెడు కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టండి..

మంగళవారం, 18 ఏప్రియల్ 2017 (13:28 IST)

ఎండు ద్రాక్షలను రోజూ తీసుకునేవారిలో గుండెజబ్బులు దూరమవుతాయి. రక్తపోటును ఎండుద్రాక్ష అదుపులో ఉంచుతుంది. రక్తం వృద్ధి చెందెలా చేస్తుంది. రెగ్యులర్‌గా మహిళలు ఎండుద్రాక్షలను తీసుకుంటే వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చు. ఎండు ద్రాక్షల్ని తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి.
 
ఎండుద్రాక్షలు క్యాన్సర్ కారకాలతో పోరాడుతాయి. ఎండు ద్రాక్షని తరచూ తీసుకోవడం వల్ల రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతం అదుపులో ఉంటుంది. వీటిని రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. వైరల్‌, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా కాపాడుతుంది. రక్తహీనతను దూరం చేసే ఎండుద్రాక్షలు.. శరీరంలో పేరుకుపోయిన అనవసరపు కొవ్వును కరిగిస్తుంది. డయాబెటిక్ పేషెంట్లు రోజుకు ఐదేసి ఎండు ద్రాక్షలను తీసుకోవడం మంచిది. 
 
అధిక రక్తపోటును నియంత్రించడంలో ఎండుద్రాక్షలు భేష్‌గా పనిచేస్తాయి. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా ఉంచుతాయి. శరీరంలో రక్తప్రసరణను మెరుగుపరిచే ఎండుద్రాక్షలు కేశాల సంరక్షణకు మెరుగ్గా పనిచేస్తుంది. చర్మానికి కూడా మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.   దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కరివేపాకు పొడిని, పచ్చడిని ఆహారంలో భాగం చేయాల్సిందే..

కరివేపాకులో ఎన్నో ప్రయోజనాలున్నాయి. కరివేపాకు కొలెస్టరాల్‌ను, మధుమేహాన్ని, బీపీని ...

news

కాకర కాయ రసం తీసుకునే షుగర్ వ్యాధిగ్రస్తులు ఎలా తీసుకోవాలంటే...

షుగర్ వ్యాధి అనగానే ఏది తినాలన్నా భయమేస్తుంది. అందుకనే వ్యాధి సంక్రమిస్తే జీవనశైలిలో చాలా ...

news

రోజుకు మూడు ఆరటిపండ్లు ఆరగిస్తే...

మనం ఉదయం నుంచి రాత్రి పడుకునే వరకూ ఎన్నో రకాల పండ్లను తింటుంటాం. కొన్ని పండ్లు ఆయా ...

news

బీపీ, ఒత్తిడిని నివారించే వాల్‌నట్స్

వాల్‌నట్స్‌ (అక్రోటు కాయ)లు ఒత్తిడి, లో బీపీలను నివారించేందుకు ఉపయోగపడతాయని తాజా ...