Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అన్నం తినేందుకు ముందు ఆకలేస్తే నట్స్ నమిలేయండి..

గురువారం, 8 జూన్ 2017 (16:06 IST)

Widgets Magazine

అన్నం తినడానికి ముందర ఆకలి వేస్తే జంక్ ఫుడ్ తీసుకోకుండా వాటికి బదులుగా కొన్ని నట్స్ తీసుకుంటే బరువు తగ్గుతారు. బాదం పప్పులు, జీడి పప్పులు, పిస్తాలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. వీటిల్లో క్యాలరీలు కూడా తక్కువగానే ఉంటాయి. అయితే ఉప్పు కలిపిన నట్స్‌ను మాత్రం తినొద్దు. ఎందుకంటే సోడియం ఎక్కువ శాతం శరీరంలోకి వెళ్లడం వల్ల రక్తపోటు పెరిగే ప్రమాదం ఉంది. 
 
ఇక బరువు తగ్గాలంటే.. ప్లెయిన్‌ ఓట్‌ మీల్‌ తింటే ఎంతో మంచిది. ఇందులో పీచుపదార్థాలు బాగా ఉంటాయి. పైగా వీటిని తినడం వల్ల తొందరగా ఆకలి వేయదు. పొట్ట చుట్టూరా కొవ్వు చేరి ఇబ్బంది పడుతున్న వాళ్లకి ఓట్‌ మీల్‌ మంచి దివ్యౌషధం. వీటిని తినడం వల్ల పొట్ట చుట్టూ చేరిన కొవ్వు తగ్గుతుంది.
 
అలాగే బెర్రీస్‌ను వారానికి రెండుసార్లు తీసుకోవడం ద్వారా  బరువు తగ్గొచ్చు. యాంటాక్సిడెంట్లు, పీచుపదార్థాలు బెర్రీల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే పొట్ట తగ్గుతుంది. బెర్రీలంటే స్ట్రాబెర్రీస్‌, బ్లూబెర్రీస్‌ ... ఇవన్నీ బ్లడ్‌ షుగర్‌ని తగ్గిస్తాయి.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

వారంలో ఐదు రోజులు పండ్లు, కూరగాయలు.. రెండుసార్లు చేపలు తీసుకోండి

వారంలో ఐదురోజుల పాటు పండ్లు, కూరగాయలు తీసుకోవాలని.. వారానికి రెండుసార్లు చేపలు తీసుకుంటే ...

news

ఎండలు తగ్గాయ్.. చిరుజల్లులు పడుతున్నాయ్.. ఫిట్‌గా ఉండాలంటే?

ఎండలు తగ్గుముఖం పట్టాయి. చిరుజల్లులు మొదలయ్యాయి. సీజన్ మారుతోంది. ఒక్కసారిగా సీజన్ ...

news

గుండెకు ఎండుకొబ్బరి ఎంత మేలో...!

పచ్చికొబ్బరిని తింటే ఎంత రుచిగా ఉంటుందో.. ఎండిన తర్వాత కూడా అంతకు రెట్టింపు రుచి ...

news

చేతులు మాటిమాటికీ కడుక్కుంటూ, వేసిన తలుపుల్ని మళ్లీమళ్లీ చెక్ చూస్తూ.. డౌటే లేదు.. ఇది అదే..

కుటుంబంలో ఎవరో ఒకరి ప్రవర్తనలో ఉన్నట్లుండి మార్పు వస్తుంది. చేసిన పనినే పదే పదే ...

Widgets Magazine