శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Kowsalya
Last Updated : శనివారం, 18 ఆగస్టు 2018 (16:35 IST)

ప్రతిరోజూ సెనగలను ఆహారంలో చేర్చుకుంటే?

ఆహారపు దినుసులలో సెనగలు ఒకటి. ఈ సెనగలలో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో ఉంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు

ఆహారపు దినుసులలో సెనగలు ఒకటి. ఈ సెనగలలో గల ఆరోగ్య విషయాలను తెలుసుకుందాం. ఇవి చిన్నవిగాను, పెద్దవిగాను రెండు పరిమాణాల్లో ఉంటాయి. పెద్దవి కొద్దిగా తెల్ల రంగులో ఉంటాయి. వీటినే కాబూలీ సెనగలు అంటారు. చిన్నవాటిని దేశీ సెనగలు అంటారు. ఇవి నలుపు, ఎరుపు, పసుపు పచ్చ, ఆకు పచ్చ, మట్టి రంగులో ఉంటాయి.
 
ఈ సెనగలు ఎండబెట్టి తీసుకోవడం వలన రక్తస్రావాలను అరికడుతుంది. సెనగలతో తయారుచేసిన సూప్‌ను తరుచుగా తీసుకుంటే శరీరంలో మంటని తగ్గిస్తుంది.

సెనగ పిండిలో చేదు పొట్ల ఆకులను చేర్చి చేసిన సూప్‌ను తీసుకోవడం వలన కడుపు నొప్పి, కడుపులోని అల్సర్‌ను తగ్గిస్తుంది. సెనగల పిండిలో ధనియాలు కలుపుకుని సూప్‌గా తయారుచేసుకుని తీసుకుంటే వాంతులు వంటి సమస్యలు తొలగిపోతాయి.