శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (13:24 IST)

గర్భాశయ సమస్యలకు మందార టీతో పరిష్కారం

గ్రామాల్లో… పట్టణాల్లో… కాస్తంత స్థలం ఉన్న ప్రతివారూ ఇంట్లో వేసుకునే చెట్టు మందారం. ఇందులో ముద్ద మందారం, రేఖ మందారం ఇలా చాలా రకాలున్నాయి. ఇలా అనేక రకాలుగా పూచే మందార పూలు అందానికే కాదు… ఆరోగ్యానికి కూ

గ్రామాల్లో… పట్టణాల్లో… కాస్తంత స్థలం ఉన్న ప్రతివారూ ఇంట్లో వేసుకునే చెట్టు మందారం. ఇందులో ముద్ద మందారం, రేఖ మందారం ఇలా చాలా రకాలున్నాయి. ఇలా అనేక రకాలుగా పూచే మందార పూలు అందానికే కాదు… ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. ఒక్క పువ్వులే కాదు... ఆకులు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. తల ఒత్తుగా పెరగడానికి… జుట్టు రాలిపోకుండా ఉండడానికి… చర్మ వ్యాధులు నియంత్రించడానికి మందార పూలు, ఆకులు కూడా ఉపయోగపడతాయి.
 
మందార ఆకులను నానిన మెంతులతో కలిపి మెత్తగా నూరి తలకు ప్యాక్‌గా వేసి ఆరిన తర్వాత కుంకుడు కాయలతో తల స్నానం చేస్తే జట్టు మృదువుగా మారుతుంది. అంతేకాదు జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది. కొబ్బరినూనెలో మందాల పూలను వేసి మరిగించి.. చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే జట్టు ఒత్తుగా పెరుగుతుంది.
 
మందాల పువ్వులే కాకుండా ఆకులు కూడా వైద్యంలో ఉపయోగిస్తారు. గర్భాశయ సమస్యలను మందార సహాయంతో నివారిస్తారు. మందాల పూలతో తయారు చేసే టీ శరీరంలోని వేడిని తగ్గిస్తుంది. మందార ఆకుతో చేసిన టీని తాగడం వల్ల రక్తపోటు తగ్గుతుంది. మందార ఆకు టీ సేవించటం వలన రోగనిరోధక శక్తి పెరిగి తద్వారా జలుబు, దగ్గు తగ్గటానికి సహాయపడుతుంది. మందార ఆకు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది. మందార ఆకులలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ తొలగించి వృద్ధాప్య ఛాయలను నివారించడానికి తోడ్పడుతుంది.