శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chj
Last Modified: సోమవారం, 2 మే 2016 (12:41 IST)

రోజూ ఓ బెల్లం ముక్క తింటే ప్రయోజనం ఏంటి..?

ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిపోయాక కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేగాక, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధిపడి రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడ

ప్రతిరోజూ మధ్యాహ్నం, రాత్రి భోజనం అయిపోయాక కొద్దిగా బెల్లం తినడం వల్ల శరీరంలో జీర్ణశక్తి పెరుగుతుంది. అంతేగాక, శ్వాసనాళాలు, ఊపిరితిత్తులు, ఆహారనాళాలు శుద్ధిపడి రక్తం కూడా వృద్ధి చెందుతుంది. వేసవిలో నీటిలో కొద్దిగా బెల్లం వేసి కలిపి తాగితే శరీరంలో వేడి తగ్గుతుంది. సహజమైన తీపి ఉన్న బెల్లం శరీర శక్తిని చాలావరకు పెంచుతుంది.
 
ఆయుర్వేదంలోనూ బెల్లానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. చలికాలంలో దగ్గు, జలుబు లాంటి ఎన్నో రోగాలను నిరోధించే శక్తి బెల్లానికి ఉంది. చిటికెడు బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే చాలు... రక్తప్రసరణ బాగా జరుగుతుందట. ఇంటి నుంచి బయలుదేరే ముందు బెల్లం తినడం వల్ల మన ఆలోచనలు కూడా చాలా పాజిటివ్‌గా ఉంటాయి. ఎందుకంటే బెల్లంలో ఉండే తీపి ముఖ్యంగా మనశ్శాంతిని పెంచుతుంది. ఇందులో ఎలాంటి రసాయన పదార్థాల వాడకం ఉండదు. ఇక నుంచి ఆ బెల్లమే కదా అని లైట్ తీసుకోకండి.. కాస్త అప్పుడప్పుడు చిటికెడుబెల్లాన్ని నోట్లో వేసుకోండి.
 
మజ్జిగ ఆరోగ్యానికి అమృతం లాంటిది. మజ్జిగ తీసుకోవడం వలన పలు జబ్బులను దూరం చేస్తుంది. బజార్లో లభించే శీతలపానీయాలకన్నా మజ్జిగ లక్షలరెట్లు మంచిది. మజ్జిగతో ఎన్నో లాభాలున్నాయి. ఎక్కిళ్ళు వస్తున్నప్పుడు ఒక చెంచా మజ్జిగలో సొంఠి కలుపుకుని సేవించండి. వెంటనే ఉపశమనం కలుగుతుంది. వాంతులయ్యేటప్పుడు మజ్జిగతోపాటు జాజికాయను గీసుకుని మజ్జిగలో కలుపుకుని సేవించండి. వేసవికాలంలో ప్రతిరోజు రెండుసార్లు మజ్జిగ తీసుకుంటే ఆరోగ్యానికి చాలామంచిది. ఇందులో వేయించిన జీలకర కలుపుకుని సేవిస్తే ఉపశమనం కలుగుతుంది. కాళ్ళ పగుళ్ళకు మజ్జిగ నుంచి తీసిన తాజా వెన్నను పూస్తే ఉపశమనం కలుగుతుందంటున్నారు ఆరోగ్య నిపుణులు.