శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By pnr
Last Updated : గురువారం, 6 ఏప్రియల్ 2017 (12:17 IST)

స్కిన్ టోనర్‌ ఖర్బూజ... చర్మ సమస్యలు దూరం...

వేసవికాలంలో నీరు పుష్కలంగా ఉండి ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఖర్బూజ కూడా ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా... అనేక పోషకాలు ఉన్నాయి. అలాంటి పండు స్కిన్ టోనర్‌గా కూడా పని చేస్తుంది.

వేసవికాలంలో నీరు పుష్కలంగా ఉండి ప్రకృతి ప్రసాదించిన పండ్లలో ఖర్బూజ కూడా ఒకటి. ఇందులో నీటి శాతం అధికంగా ఉండటమే కాకుండా... అనేక పోషకాలు ఉన్నాయి. అలాంటి పండు స్కిన్ టోనర్‌గా కూడా పని చేస్తుంది. ఈ పండును ఆరగిస్తే చర్మ సమస్యలకు సైతం దూరంగా ఉండొచ్చు. ఖర్బూజను ఆరగిస్తే కలిగే ప్రయోజనాలను పరిశీలిస్తే...
 
ఖర్బూజ పండులో బోలెడు సుగుణాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ఎంతో మంచిది. చర్మానికి కూడా ఇది ఎంతో మేలు చేస్తుంది. వేసవిలో కాలంలో విరివిగా లభించే ఈ పండును ఆరగించడం వల్ల పలు రకాల చర్మ సమస్యల బారిన పడకుండా చేస్తుంది. స్కిన్‌ టోనర్‌లా పనిచేయడమే కాకుండా జిడ్డు, పొడి చర్మాలకి కూడా ఖర్బూజ ఫేస్‌ప్యాక్‌ భేష్‌‌గా ఉంటుందని సౌందర్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.