శుక్రవారం, 29 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By
Last Updated : శనివారం, 8 డిశెంబరు 2018 (14:42 IST)

ఈ సపోటా పండ్లు తీసుకుంటే ప్రయోజనాలు ఏమిటంటే...?

శరీరం బలహీనంగా ఉన్నప్పుడు రెండు లేదా మూడు సపోటా పండ్లు తీసుకుంటే మంచిది. పెరటి పండైన సపోటాలో సమృద్ధిగా లభించే ఫ్రక్టోస్ శరీరంలో త్వరగా శక్తిని పెంచేలా చేస్తుంది. సపోటా పండు రుచి చాలా బాగుంటుంది. ఈ పండు గుజ్జులో లభించే పీచు, పై పొట్టులో ఉండే కెరోటిన్స్ మలవిసర్జన సాఫీగా జరిగేలా చేస్తాయి. అంతేకాదు.. రక్తంలోని గ్లూకోజ్ లెవల్స్‌ను కంట్రోల్ ఉంచుతుంది.
 
కీటకాలు కుట్టినప్పుడు చర్మభాగంపై సపోటా విత్తనాల పేస్ట్‌ రాసుకుంటే నొప్పి తగ్గిపోతుంది. సపోటా విత్తనాల నూనెను తలకు రాసుకుంటే.. జుట్టు రాలే సమస్య ఉండదు. సపోటాలు తినటం వలన వికారం తగ్గుతుంది. అందుకే గర్భిణీలు సపోటాను తినటం మంచిదని నిపుణులు అంటున్నారు. సపోటా తినటం వల్ల శ్లేష్మం శరీరం నుండి బయటకు వస్తుంది. 
 
తద్వారా జలుబు, దగ్గు తగ్గిపోతాయి. ఒత్తిడిని తగ్గించే గుణం సపోటాకు ఉంది. సపోటాలో విటమిన్‌ సి శరీరంలోని హానికారక ఫ్రీరాడికల్స్‌ను తొలగిస్తుంది. తాజా పండులోని పొటాషియం, రాగి, ఇనుము, లాంటి పోషకాలు.. ఫోలేట్‌, నియాసిన్‌, పాంథోయినిక్‌ ఆమ్లాలు జీవక్రియను మెరుగుపరుస్తాయి. 
 
సపోటా పండులో గ్లూకోజ్‌ అధిక మోతాదులో ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరుకు చాలా ఉపయోగపడుతుంది. సపోటాలోని విటమిన్‌ ఎ కంటిచూపును మెరుగుపరుస్తుంది. సపోటాలో క్యాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌ ఎక్కువ మోతాదులో ఉంటాయి. ఎముకల గట్టిదనానికి ఇవి ఎంతో దోహదపడుతాయి.