Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

నూనెతో వేయించిన రొయ్యల్ని అతిగా తినకండి.. కూరలే బెస్ట్..

సోమవారం, 10 జులై 2017 (13:18 IST)

Widgets Magazine
prawns

రొయ్యలు రుచిగా వుంటాయని ఎక్కువ నూనెతో వేయించిన వేపుళ్లతో తినకుండా.. తక్కువ నూనె వాడి చేసిన కూరలను తీసుకోవడం మంచిది. ఎక్కువ నూనెలో రొయ్యల్ని వేపడం ద్వారా వాటిలోకి పోషకాలు తొలగిపోతాయి. నూనెలో డీప్ ఫ్రై చేసిన రొయ్యల్ని అతిగా తింటే.. మోతాదుకు మించితే ప్రమాదమేనని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. రొయ్యల్లో సోడియం, కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉండటంతో వీటిని మితంగా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు. 
 
అయితే రొయ్యల్లోని సెలీనియమ్‌ క్యాన్సర్‌ కారకాలను అడ్డుకుంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ గుండె రక్త నాళాల్లో పూడికలు రానివ్వదు. రక్తసరఫరాకు అడ్డుపడే కొవ్వును తొలగిస్తుంది. దీంతో రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. దంతాలకు... ఎముకలకు బలాన్నిస్తాయి. చర్మకాంతికి తోడ్పడే ‘విటమిన్‌ ఇ’, విటమిన్‌ బి 12 లభిస్తాయి. రొయ్యల్లో తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
 
రొయ్యల్లో క్యాల్షియం, పొటాషియం, ఫాస్పరస్ వుండటం ద్వారా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిల్ని క్రమబద్ధీకరిస్తుంది. రొయ్యలతో పాటు షెల్‌‍ఫిష్, ఇతర చేపల్లోనూ ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా వుంటాయి. తద్వారా హృద్రోగ వ్యాధులు, క్యాన్సర్‌ను అడ్డుకుంటుంది. అయితే 50 ఏళ్లకు మించిన వారు వీటిని తీసుకోవడంలో జాగ్రత్త వహించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

సైకిల్ వాడకం .. ఉపయోగాలు...

ప్రస్తుత హైటెక్ జీవితంలో సైకిల్ తొక్కడం అనేది చాలా మంది నామూషిగా భావిస్తున్నారు. కానీ, ...

news

నాజూగ్గా కనిపించాలంటే రోజుకు అరగంట కాదు.. పది నిమిషాలైనా నడవండి..

నాజూగ్గా కనిపించాలంటే.. వారానికి ఓ గంట వ్యాయామం చేయాల్సిందే. లేకుంటే రోజుకో అరగంట ...

news

రాత్రిపూట.. ఫుల్‌గా లాగిస్తే.. ఒబిసిటీ తప్పదు..

ఉదయం, మధ్యాహ్నం తక్కువగా భోజనం తీసుకుని.. రాత్రిపూట ఫుల్‌గా లాగిస్తే ఇబ్బందులు ...

news

ప్రతి ఇంటిలోనూ ఉండాల్సిన మధురపలం దానిమ్మతో షుగర్‌కి చెక్

మధుమేహ రోగులు ఈ ప్రపంచంలో నాలుగు వస్తువులు లేవనుకోవాలని వైద్యులు చెబుతుంటారు. అవేమంటే ...

Widgets Magazine