గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By ivr
Last Modified: గురువారం, 28 జనవరి 2016 (15:27 IST)

ఎంత ప్రయత్నించినా నిద్ర రావట్లేదా...? అయితే ఈ చిట్కాలు పాటించండి...

మనిషి ఆరోగ్యంగా ఉండేందుకు నిద్ర చాలా అవసరం. దేశంలోని 93 శాతం ప్రజలు నిద్రలేమితో బాధపడుతున్నట్లు ఓ సర్వే తెలిపింది. నిద్రలేమి కారణంగా తమ పనిపై తీవ్రమైన ప్రభావం చూపిస్తోందని 58 శాతం ప్రజలు చెప్పినట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు. సుఖవంతమైన నిద్ర పొందేందుకు కొన్ని చిట్కాలు మీ కోసం...
 
* భోజనం చేసిన తర్వాత చల్లటి గాలిలో 15 నుంచి 20 నిమిషాలపాటు తిరుగాడండి.
 
* భోజనానికి నిద్రకు మధ్య 15 నుంచి 20 నిమిషాల తేడా ఉండాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
* నిద్రకుపక్రమించే ముందు చల్లటి నీటితో మీ కాళ్ళను కడుక్కోండి. దీంతో అలసట తీరి సుఖవంతమైన నిద్ర వస్తుంది.
 
* నిద్రకుపక్రమించే ముందు గోరువెచ్చటి పాలను సేవించండి. ఎందుకంటే ఇందులోనున్న ట్రిప్టోఫెన్ అమినో యాసిడ్ నిద్రకుపక్రమింపజేస్తుంది.
 
* నిద్రకు ముందు ఎట్టి పరిస్థితుల్లోను టీ లేదా కాఫీ సేవించకండి. పాలు సేవించడం చాలా ఉత్తమంటున్నారు ఆరోగ్య నిపుణులు. 
 
* నిద్రపోయే ముందు ప్రశాంత వదనంతో నిద్రలోకి చల్లగా జారుకోండి.
 
* నిద్రపోయేటప్పుడు బెడ్‌పై లేదా మీ పడకపై పడుకోవడం మంచిదే, కాని నిద్ర రాకపోతే బలవంతంగానైనా నిద్రపోయేందుకు ప్రయత్నించకండి. ఇలా చేస్తే ఆ ప్రభావం మెదడుపై పడి వచ్చే నిద్ర పారిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి ప్రయత్నాలు ఆరోగ్యానికి అనర్థదాయకమంటున్నారు వైద్యులు.