శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By chitra
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (08:55 IST)

చర్మ సౌందర్యాన్ని పెంపొందించే కలబంద

గ్రామలలోని పలు ప్రాంతాలలో అధికంగా కనిపించే కలబంద ఇప్పుడు ఆరోగ్యప్రదాయినిగా మారిందంటున్నారు వైద్యులు. కలబంద ఆకుల్లో నీటిని పీల్చుకునే గుణంవుంది. కలబంద రసాన్ని ముఖానికి పట్టిస్తే చర్మం ప్రకాశవంతంగా తయారవుతుంది. అలాగే గాయాలేర్పడితే కలబంద రసాన్ని కాలిన గాయాలపై పూతలా పూస్తే గాయాలు మటుమాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. కలబంద అందానికి మాత్రమే కాదు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. అవేంటో చూద్దాం!
 
ఉదయం పరకడుపున కలబంద ఆకులను సేవిస్తే ఉదర సంబంధమైన సమస్యలుంటే తొలగిపోతాయి.
 
కలబంద ఆకుల రసంలో కాసింత కొబ్బరి నూనె కలిపి ఈ మిశ్రమాన్ని మోచేతులు, పాదాల్లో పూస్తే  చర్మంపైనున్న నల్లటి మచ్చలు తగ్గుతాయి.  
 
రోజ్ వాటర్‌లో కలబంద రసాన్నిచర్మంపై పూస్తే పొడిబారిన చర్మం తిరిగి కళకళలాడుతుంది. 
 
కలబంద రసంలో ముల్తానీ మట్టి లేక చందపు పొడి కలుపుకుని ముఖంపైనున్న మొటిమలకు పూస్తే మొటిమలు మాయమౌతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.