శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 26 మార్చి 2015 (18:32 IST)

ఆఫీసుల్లో ఏసీల కింద, ఇంట్లో ఫ్యాన్ల కిందే ఉంటున్నారా?

రోజంతా చురుగ్గా ఉండాలంటే.. న్యూట్రీషన్లు ఇచ్చే సలహా ఏంటంటే.. బ్రేక్ ఫాస్ట్‌లో అధికంగా ప్రోటీనులు ఉండేలా చూసుకోవాలి. మహిళలు అప్పుడప్పుడు హై ఫ్యాట్ స్నాక్స్, అధికంగా ఉండే షుగర్ ఫుడ్ ఈవెనింగ్ టైమ్‌లో తీసుకోవడం తగ్గించాలి. గుడ్లు తీసుకోవచ్చు. పచ్చసొనలో విటమిన్ బి12 అధికంగా ఉంటుంది. ఇది మూడ్‌ను రెగ్యులేట్ చేస్తుంది.
 
అలాగే శరీరానికి కావలసిన ఫిజికల్ ఎక్సర్ సైజ్ చాలా ముఖ్యం. కొంచెం బ్రిస్క్ వాక్ లేదా జాగింగ్ తక్షణ శక్తిని అందిస్తుంది. ఇంకా మార్నింగ్ సమయంలో హ్యాపీగా ఉండేందుకు బూస్ట్‌లా ఉపయోగపడుతుంది. ఇంట్లో కానీ, ఆఫీస్‌లో కానీ, మీరు ఆకలితో కానీ లేదా నీటి దాహంతో కానీ అలాగే ఉండి పనిచేసుకోకూడదు. ఎప్పుడూ అదికంగా నీళ్ళు త్రాగాలి. కాఫీని నివారించాలి.
 
విటమిన్ ఎ,డి, ఇ, కెలు పుష్కలంగా కలిగిన ఫుడ్స్ తీసుకోవాలి. తృణధాన్యాలు తీసుకోవాలి. మంచి పోషకాహారం, లో క్యాలరీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే సూర్యరశ్మితో లభించే విటమిన్ డి లెవల్ పెరగాలంటే సూర్య కిరణాలు శరీరంపై పడేలా చూసుకోవాలి. ఎప్పుడూ ఆఫీసుల్లో ఏసీల కింద, ఇంట్లో ఫ్యాన్‌ల కిందనే ఉండకూడదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.