శీతాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

మంగళవారం, 28 నవంబరు 2017 (19:36 IST)

beauty

శీతాకాలం రాగానే శరీరం పొడిబారినట్లవుతుంది. కొందరిలో చర్మం చిట్లుతుంది. పెదవులు పగిలిపోతుంటాయి. ముఖ్యంగా మహిళలు శరీరం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలి. పొడి చర్మం కలిగిన వారైతే... రెండు టీ స్పూన్లు బాదంనూనె, రెండు టీస్పూన్ల బాదం పొడి, రెండు టీ స్పూన్లు అరటి ముక్కలు, రెండు టీస్పూన్లు గ్లిజరిన్ లేదా తేనే, నాలుగు టీ స్పూన్లు పాలు కలిపి మెత్తని గుజ్జు మాదిరి పేస్ట్ చేసి ముఖానికి, మెడకు మృదువుగా మసాజ్ చేస్తూ పట్టించి కొద్దిసేపు వుంచి కడిగేయాలి. చర్మం మృదువుగా మారుతుంది. శీతాకాలంలో అద్భుతంగా పనిచేస్తుంది. చేతులు, పాదాలకు కూడా అప్లయ్ చేయవచ్చు. 
 
జిడ్డు చర్మం కలిగిన వారు.. రెండు టీ స్పూన్లు ఓట్‌మీల్‌ పొడి, నాలుగు టీ స్పూన్లు మజ్జిగ, రెండు టీ స్పూన్లు గంధం పొడి కలిపి ముఖానికి, మెడకు బాగా పట్టించి, గోరువెచ్చని నీటితో కడిగేస్తే జిడ్డు చర్మం పోయి కాంతివంతంగా ఉంటుంది. 
 
ఇక శిరోజాల సంరక్షణకు.. ఒక కప్పు బొప్పాయి గుజ్జు, అరకప్పు కొబ్బరి క్రీమ్ లేదా పాలు, పావు కప్పు కొబ్బరినూనె, పావు కప్పు బీట్ రూట్ జ్యూస్ కలిపి పేస్టు తయారు చేసుకుని జుట్టుకు,  పట్టించాలి. పదినిమిషాలాగి హెర్బల్ షాంపూతో వాష్ చేసుకోవాలి. శీతాకాలంలో ఈ ప్యాక్ జుట్టును పరిరక్షిస్తుంది. జుట్టురాలడాన్ని, చుండ్రును తగ్గిస్తుంది.దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

ఆరోగ్యం

news

కాకర గింజల చూర్ణం నీటితో, తేనెతో తీసుకుంటే?

చాలామంది కాకరకాయలోని చేదును గమనించి దగ్గరకు రానియ్యరు. కానీ కాకరకు ఎన్నో ఔషధ ...

news

పక్కతడపడం ఆపే అద్భుతమైన చిట్కా..

మా అమ్మాయికి పదేళ్ళు దాటాయి. ఇంకా పక్క తడుపుతూనే ఉంది. మా వాడికి ఎంత వయస్సు వచ్చినా పక్క ...

news

స్వీట్‌కార్న్‌తో బరువు తగ్గుతారు.. చర్మం మెరిసిపోతుంది..

స్వీట్ కార్న్‌‌తో పాటు మామూలు మొక్కజొన్నలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా వున్నాయి. పసుపు ...

news

చలికాలంలో వేడి అన్నం-కరివేపాకు కారం

చలికాలం వచ్చేస్తుంది. ఆహార విషయంలో జాగ్రత్తలు పాటించాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. ...