మంగళవారం, 19 మార్చి 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By tj
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (16:31 IST)

బెల్లం, నువ్వులు కలిపి మేకపాలతో కలిపి తాగితే...

మన పెద్దవారు ఇప్పటికీ శరీరంలో ఏదైనా నొప్పులు వస్తే ఇంగ్లీషు మందులు వాడొద్దంటూ చెబుతుంటారు. కానీ మనం పట్టించుకోము. చాలా సులువుగా నొప్పులు తగ్గిపోతాయని మందులు వాడేస్తుంటాం. కానీ ఇంగ్లీషు మందుల వల్ల శరీర

మన పెద్దవారు ఇప్పటికీ శరీరంలో ఏదైనా నొప్పులు వస్తే ఇంగ్లీషు మందులు వాడొద్దంటూ చెబుతుంటారు. కానీ మనం పట్టించుకోము. చాలా సులువుగా నొప్పులు తగ్గిపోతాయని మందులు వాడేస్తుంటాం. కానీ ఇంగ్లీషు మందుల వల్ల శరీరానికి ఎంత ఎఫెక్టోనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటికీ మన పెద్దవారు ఆయుర్వేదం వంటి మందులను వాడమని సలహాలు ఇస్తుంటారు. అదే ఉత్తమం. అదెలాగంటారా.. అయితే ఇది చూడండి.
 
బెల్లం, నువ్వులు కలిపి ఈ విధంగా తీసుకుంటే మోకాళ్ళ నొప్పులు, ఇతర కీళ్ళనొప్పులు ఈ జన్మకి రావు. చిన్నా పెద్ద తేడా లేకుండా ఇపుడు ప్రతి ఒక్కరూ ఎదుర్కొంటున్న సమస్య కీళ్ల నొప్పులు. ఫ్లోరైడ్ లోపం వల్ల కూడా మోకాల్లు నొప్పులు, కీళ్ల నొప్పులు వస్తుంటాయి. ఎన్ని మందులు వాడినా తాత్కాలిక ఉపశమనం తప్ప, శాశ్వత పరిష్కారమంటూ లభించదు. కీళ్లనొప్పులకు మనకు తెలియని శాశ్వత పరిష్కారం ఏంటంటే మేకపాలు
 
ప్రతిరోజు ఉదయం సాయంత్రం ఒక గ్లాస్ గోరువెచ్చని మేక పాలలో చిన్న బెల్లం ముక్క, చెంచా నువ్వుల పొడి కలుపుకుని తాగాలి. ఇలా క్రమం తప్పకుండా తాగితే నెలరోజుల్లోనే కీళ్ల నొప్పులు తగ్గడం అనుభవపూర్వకంగా తెలుస్తుంది. మేకపాలలో కాల్షియం, ప్రోటీన్, డి విటమిన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరానికి మెండుగా లభించి అరిగిపోయిన కార్టిలేజ్ పునరుత్పత్తి చెందేలా చేస్తాయి.