శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. చిట్కాలు
Written By Selvi
Last Updated : గురువారం, 16 అక్టోబరు 2014 (16:25 IST)

హాట్ వాటర్ తాగండి.. యంగ్‌గా ఉండండి..!

నిత్యయవ్వనులుగా ఉండాలంటే హాట్ వాటర్ తాగాల్సిందే. ఉదయం పరగడుపున నీటిని సేవించడం, ఆహారం తీసుకున్న తర్వాత వేడి నీటిని సేవించడం ద్వారా ఆయుష్షు పెరగడంతో పాటు నిత్య యవ్వనులుగా కనిపిస్తారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.  
 
శరీరానికి బ్లీచ్‌గా ఉపయోగించే హాట్ వాటర్ శీతాకాలంలో జలుబు, దగ్గు వంటి రుగ్మతలను దూరం చేస్తుంది. హాట్ వాటర్‌తా కాస్త నిమ్మరసాన్ని చేర్చి సేవిస్తే ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుందని, ఒబిసిటీకి చెక్ పెట్టవచ్చు. 
 
టీనేజ్ అమ్మాయిలు, పురుషులు పిగ్మెంట్స్‌ నుంచి ఉపశమనం పొందాలంటే.. ఱ వేడినీటిని సేవించడం మంచిది. వేడినీటి సేవనంతో జుట్టు కూడా బాగా పెరుగుతుంది. హాట్ వాటర్ తాగడం ద్వారా రక్త ప్రసరణ సక్రమం అవుతుంది. నరాల్లోని కొలెస్ట్రాల్ సైతం కరిగిపోతుంది. 
 
నెలసరి సమయంలో ఏర్పడే రుగ్మతలకు హాట్ వాటర్ దివ్యౌషధంగా పనిచేస్తుంది. వ్యాయామాలతో బరువు తగ్గించుకోవాలనుకునే వారు... ఆహారం తీసుకున్నాక వేడి నీటిని సేవిచండి. మధ్యాహ్న భోజనం తీసుకున్న తర్వాత కాసింత వేడి నీటిని తాగడం ద్వారా బ్యాడ్ కొలెస్ట్రాల్ తొలగిపోతుంది.